తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రోజు దర్శనాలకు బ్రేక్..! మూసివేయనున్న శ్రీవారి ఆలయం..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆ రోజు దర్శనాలకు బ్రేక్..! మూసివేయనున్న శ్రీవారి ఆలయం!! || Oneindia Telugu

తిరుమల/హైదరాబాద్ : నిత్యం కోట్ల మంది భక్తి భక్తులతో కిటకిట లాడే తిరుమల దేవాలయనికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వబోతున్నారు ఆలయ అర్చకులు. ఆ రోజు భక్తులు కొంగమీదకు రాకుండా ఉంటేనే శ్రేయస్కరంగా ఉంటుందని తిరుమల వేద పండితులు చెప్పుకొస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈనెల 16వ తేదీన తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.

ఆరోజు చంద్రగ్రహణం కావున స్వామి వారి ఆలయాన్ని రాత్రి ఏడు గంటలకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా భక్తులను ముందురోజు అర్ధరాత్రి తర్వాత నుంచే క్యూలైన్లలోకి అనుమతించరని, ఈ విషయాన్ని గమనించి భక్తులు కొండపైకి రాకుండా ఉండడమే మంచిదని సూచించారు. పది హేడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారన్నారు. ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అందువల్ల దాదాపు పన్నెండు గంటలపాటు స్వామి వారి దర్శనం ఉండదని తెలిపారు.

Break the darshanam on that day.!Shrivari Temple to be closed for one day..!!

క్యూ లైన్లలోకి కూడా భక్తులను అనుమతించనందున కొండపైకి వచ్చే వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ కారణంగా ఆ సమయంలో భక్తులు రాకుండా ఉండడమే మంచిదని సూచించారు. అంతేకాదు జూలై 17వ తేదీ బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుండి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

English summary
The temple priests are going to rest for a day at the Tirumala Temple, which is crowded with millions of devotees. Thirumala Veda scholars claim that the devotees of that day will prosper only if they do not come to the stork. Officials of Tirumala Tirupati Temple have advised pilgrims to postpone their journey on the 16th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X