• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డికి బిగ్ రిలీఫ్ .. ఆ కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ కోర్టు

|

టిటిడి బోర్డు సభ్యుడు ,పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది . టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి పై నమోదు చేసిన అవినీతి కేసును చెన్నై సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించలేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది శేఖర్ రెడ్డికి,శేఖర్ రెడ్డి విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొన్న వైసీపీ ప్రభుత్వానికి కూడా శుభవార్త .

టీటీడీ ఆదాయ, వ్యయాలు కాగ్ ద్వారా ఆడిట్ ... టీటీడీ సంచలన నిర్ణయం.. బీజేపీ ఎంపీ హర్షం

2016లో శేఖర్ రెడ్డి ఆస్తుల పై సీబీఐ దాడులు ... కేసు నమోదు

2016లో శేఖర్ రెడ్డి ఆస్తుల పై సీబీఐ దాడులు ... కేసు నమోదు

2016లో చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 లక్షల పాత కరెన్సీ తో పాటుగా భారీగా కోట్లాది రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, వందల కిలోల బంగారం లభించింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.శేఖర్ రెడ్డి పై అవినీతి నిరోధక చట్టం 1988 లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు శేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పడానికి సరైన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందుకు తీసుకురాలేకపోయింది అని భావిస్తూ కేసును కొట్టివేసింది.

క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ కోర్టు .. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న శేఖర్ రెడ్డి

క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ కోర్టు .. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న శేఖర్ రెడ్డి

ఈ క్రమంలో శేఖర్ రెడ్డి పై నమోదైన పాత నోట్లు చలామణి నేరంతో పాటు సి.బి.ఐ నమోదు చేసిన కేసులను క్లోజ్ చేసినట్లయింది. ఈ తీర్పు అనంతరం శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తను అక్రమంగా డబ్బులు తరలించలేదని , చట్టవిరుద్ధమైన లావాదేవీలు నడిపించే లేదని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా కోర్టు అదే చెప్పింది అంటూ కోర్టు తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని పన్నులు చెల్లించాలని, తన ఆస్తులని సక్రమమైన మార్గంలో సంపాదించాను తప్ప అక్రమంగా కూడబెట్టుకున్నవి కావని ఆయన స్పష్టం చేశారు.

టీటీడీ పాలకమండలిలో అవకాశం.. ఆయనపై వెల్లువెత్తిన విమర్శలు

టీటీడీ పాలకమండలిలో అవకాశం.. ఆయనపై వెల్లువెత్తిన విమర్శలు

తన ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలను కోర్టు ముందుంచామని పేర్కొన్న శేఖర్ రెడ్డి న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనపై సిబిఐ అధికారులు దాడులు చేయడం, చంద్రబాబు ఆయనను టిటిడి బోర్డు సభ్యుడిగా తొలగించడం జరిగింది. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి బోర్డు సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వడం గమనార్హం. దీనిపై అప్పట్లో టీటీడీ పాలక మండలిపై విమర్శలు వెల్లువెత్తాయి.

  Andhra Pradesh లో బలపడుతున్న మూడో ప్రత్యామ్నాయ వర్గం | Somu Veerraju | Pawan Kalyan
  అవినీతి ఆరోపణలకు చెక్ ... శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ .. ఊరట

  అవినీతి ఆరోపణలకు చెక్ ... శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ .. ఊరట

  టిటిడి బోర్డులో సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను సభ్యులుగా నియమించారని ఆరోపణలు గుప్పించారు . శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డులో ప్రత్యక ఆహ్వానితులుగా అవకాశం ఇవ్వటాన్ని తప్పు పట్టారు . ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాలరాస్తోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. తాజాగా శేఖర్ రెడ్డి సి.బి.ఐ క్లీన్ చిట్ ఇవ్వడం శేఖర్ రెడ్డికి మాత్రమే కాదు, వైసీపీ ప్రభుత్వానికి ఊరట.

  English summary
  The CBI court has given clean chit to Shekhar Reddy, a TTD board member and industrialist. Chennai CBI court has dismissed a corruption case registered against TTD trust board member Shekhar Reddy. The court ruled that there was no evidence that he was guilty of corruption. This is good news for Shekhar Reddy and the YCP government, which has faced opposition criticism in the case of Shekhar Reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X