తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకన్న దగ్గర జగన్‌ నాటకాలు: తన మతం చెప్పుకొని..పట్టువస్త్రాలు ఎలా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. వెంకటేశ్వర స్వామి వద్ద జగన్ నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ తన మతం చెప్పుకొని అఫిడవిట్ ఇవ్వటానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. రమణ దీక్షితులను మళ్లీ ఆగమ సలహాదారుడిగా తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఆయన్ను త్వరలోనే ప్రధాన అర్చకుడిగా కూడా నియమిస్తారని చెబుతున్నారని... టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారని నిలదీసారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఇదే రకంగా తిరుమల దర్శనం..ఆయన మతం గురించి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి గతంలో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే, జగన్ పైన బీజేపీ..అనుబంధ సంఘాలు చేస్తన్న మత పరమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం జగన్ పైన చేస్తున్న ఈ విమర్శలు సున్నితమైనవి కావటంతో చర్చకు కారణమయ్యాయి.

హిందూ విశ్వాసాలను తుంగలో తొక్కి..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం జగన్ పైన చేసిన వ్యాఖ్యలు కలకలానికి కారణమయ్యాయి. వెంకన్న దగ్గర జగన్‌ నాటకాలు ఆడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ.. కలాం లాంటి అన్యమతస్థులు వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని అఫిడవిట్‌ ఇచ్చిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకున్నారని గుర్తు చేసారు. అయితే జగన్‌కు ఇవేమీ పట్టవంటూ విమర్శించారు. తన మతం చెప్పుకుని అఫిడవిట్‌ ఇవ్వడానికి ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకు ఆలయాలకు వెళ్లకూడదన్న సంప్రదాయం ఉందని... కానీ జగన్‌ మాత్రం హిందూ విశ్వాసాలను తుంగలో తొక్కి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆరోపించారు. దేవుడితో ఆటలాడుకునేవారు బాగుపడరంటూ చంద్రబాబు మండిపడ్డారు.

CBN says Jagan not following hindu traditions in Tirumala..

టీడీపీని ఏం చేయాలనుకుంటున్నారు..
రమణదీక్షితులకు ఆగమ పదవిపై ఇవ్వటం పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారి పింక్‌ డైమండ్‌ విషయంలో నానా యాగీ చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి.. టీటీడీ ప్రతిష్ఠను అన్నివిధాలా దిగజార్చేందుకు ప్రయత్నించిన మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులపై చంద్రబాబు మండిపడ్డారు. విజయసాయి రెడ్డి, రమణదీక్షితులపై టీటీడీ వేసిన పరువునష్టం దావాను వెనక్కి తీసుకునేలా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయడం హాస్యాస్పదమన్నారు. దావాతో పాటు అనేక ఆరోపణలున్న రమణ దీక్షితులను మళ్లీ ఆగమ సలహాదారుడిగా తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఆయన్ను త్వరలోనే ప్రధాన అర్చకుడిగా కూడా నియమిస్తారని చెబుతున్నారని... టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అయితే, రమణ దీక్షితులు తన వారసులతో కలిసి శ్రీవారి దేవాలయానికి వెళ్లారు. తనకు ప్రధాన అర్చకుడిగా నియమిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని స్వయంగా ఆయనే చెప్పారు. దీంతో..ఇప్పుడు చిత్తూరు కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఏ రకంగా సమాధానం ఇస్తుందో చూడాలి.

English summary
TDP Chief Chandra babu sensational comments on CM jagan. CBN says Jagan not following hindu traditions in Tirumala. Babu also objected on appointement of Ramana Deekshitulu as advisor in TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X