• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీవారి సేవలో సుప్రీం-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు : చక్రస్నానంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

విజయదశమి పర్వదినం నాడు సుప్రీం..హైకోర్టుల న్యాయమూర్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గురువారం తిరుమల చేరుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చక్రస్నానంలో పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు.

చక్రస్నాన సేవలో సీజేఐ

చక్రస్నాన సేవలో సీజేఐ

అనంత‌రం ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 10 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

శాస్త్రోక్తంగా బ్రోహ్సోత్సవాలు

శాస్త్రోక్తంగా బ్రోహ్సోత్సవాలు

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు.

విజయ దశమి నాడు శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

విజయ దశమి నాడు శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు జడ్జిలు హిమ కోహ్లీ, జస్టిస్ జేకే మహేశ్వరి,ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ లలిత కుమారి ఇందులో పాల్గొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికారు.

  'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
  టీటీడీ స్వాగతం..ఆశీర్వాదం

  టీటీడీ స్వాగతం..ఆశీర్వాదం

  స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి..ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా పలువురు న్యాయమూర్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా దంపతులు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.

  తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

  English summary
  CJI and many High court judges perform Sri vari seva on Vijaya dasami eve in Tirumala.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X