తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గోన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం తరుపున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ఆలయ అర్చకులు పరివట్టం చుట్టారు. అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. శ్రీవారికి సమర్పించిన అనంతరం సీఎం జగన్‌కు అర్చకులు ఆశీర్వాచనలు అందించారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. దీంతో సీఎం మొదటిసారిగా పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎంతోపాటు టీటీడీ చైర్మణ్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. కాగా ఒకే కుటుంభం నుండి ఇద్దరికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కింది.

CM Jaganmohan Reddy presented the Pattu vastralu to Thirumala Sri Venkateswara Swamy

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు సార్లు పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలకు హజరు అయ్యారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు వెళ్లనున్నారు.

English summary
Andhra Pradesh CM Jaganmohan Reddy presented the ''Pattu vastralu'' to Thirumala Sri Venkateswara Swamy. ofter that cm participated in ''Pedda shesha vahana seva''.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X