• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా ఎఫెక్ట్ .. టీటీడీ అత్యవసర సమావేశం .. శ్రీవారి ఆలయం మూసివేత ?

|

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇప్పటికే పలు ఆలయాలను మూసివేస్తున్నట్టు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు సంబంధించిన ప్రకటనలు రాగా ఇప్పుడు కరోనా ప్రభావం శ్రీవారి ఆలయంపై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఆలయాల వద్ద ఆంక్షలు విధిస్తున్నారు . ఎక్కువగా జనసమూహం ఉండే ప్రాంతాలను నిరోధించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . ఇక తిరుమలలో కరోనా కలకలంతో టీటీడీ అప్రమత్తమైంది .

కరోనా వచ్చిందహో.. జాగ్రత్తగా ఉండండహో .. తెలుగు రాష్ట్రాల్లో డప్పు చాటింపు

 తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ .. అప్రమత్తమైన టీటీడీ

తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ .. అప్రమత్తమైన టీటీడీ

ఇక తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది . రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమలకు నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. దేవదేవుడి దర్శనం చేసుకుంటుంటారు. అయితే, ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో నిన్నటి వరకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టిటిడి అధికారులు అతి తక్కువ సంఖ్యలో భక్తులను దర్శనానికి పంపుతున్నారు.

అత్యవసర సమావేశం నిర్వహించనున్న టీటీడీ

అత్యవసర సమావేశం నిర్వహించనున్న టీటీడీ

గంటకు నాలుగు వేల మందిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ నేడు ఒక్కసారిగా కరోనా బాధితుడు స్వామీ వారి దర్శనానికి రావటంతో షాక్ తిన్నారు. వారణాశి నుండి తిరుపతికి వచ్చిన భక్తుడు ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో రుయా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఇక ఈ నేపధ్యంలో ఈరోజు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు.ఈరోజు నుంచి తిరుమల ఆలయాన్ని మూసెయ్యాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అశోక్ సింఘాల్ ఈ మేరకు తిరుమలలో సమావేశం నిర్వహిస్తున్నారు.

  Bigg Boss Telugu 2 Winner Kaushal Message To People On Corona Virus
  తిరుపతి అలిపిరి నడకదారిని, ఘాట్ రోడ్లు మూసివేత

  తిరుపతి అలిపిరి నడకదారిని, ఘాట్ రోడ్లు మూసివేత

  ఇప్పటికే తిరుపతి అలిపిరి నడకదారిని, ఘాట్ రోడ్ రహదారిని, కళ్యాణ కట్ట ను మూసేశారు. తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి , అర్చకులు ఏకాంతంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహించేలా చర్యలు తీసుకోబోతున్నారని సమాచారం . ప్రస్తుతం టిటిడి ఈ విషయంపై అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించడం నిలిపివేశారు. దీంతో తిరుమలకు వెళ్ళిన భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో ప్రస్తుతం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక తిరుమలలో స్వామి వారి కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని తెలుస్తుంది. కానీ భక్తుల దర్శనాలు రద్దుచేసే అవకాశం కనిపిస్తుంది.

  English summary
  TTD alerted a devotee to Tirumala that the corona was positive. It is reported that Srivari Temple will be closed till 12 noon tomorrow. closed Alipiri walkway, Ghat road and Kalyana katta . It is reported that the Thirumala Temple has been temporarily closed and the priests are going to take steps to keep the pilgrims together.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more