తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: భక్తుల దర్శనాల నిలిపివేతపై టీటీడీ మరో కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఫలితంగా భారతదేశంలో నేడు మరో మారు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ . ఇక ఈ నేపధ్యంలో ఏపీలో సైతం లాక్ డౌన్ కొనసాగుతుంది.

కరోనా ప్రభావం లేని చోట్ల పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తి వెయ్యాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నా టీటీడీ మాత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి అరికట్టటానికి స్వామి వారి దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న టీటీడీ ఇక మరికొద్ది రోజుల పాటు అలాగే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. స్వామి వారి నిత్య కైంకర్యాలు మాత్రమే కొనసాగిస్తుంది.

కరోనా కష్ట కాలంలోనూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ .. అదేంటంటేకరోనా కష్ట కాలంలోనూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ .. అదేంటంటే

ఇక ఇప్పటికే తిరుమల కొండల్లో నిశ్శబ్దం అలముకుంది. మొదటి విడత లాక్ డౌన్ నిర్ణయం తరువాత తిరుమల ఘాట్ రోడ్లను కూడా మూసేసి లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు.స్వామి వారి దర్శనం కోసం నిత్యం కిటకిటలాడిన తిరు వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక మార్చి నెలలో శ్రీవారి ఆలయాన్ని మూసివేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ కరోనా కారణంగా ఆలయంలోకి భక్తులెవ్వరిని అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే .

Corona Effect .. TTD key decision on the discontinuation of devotees visit

ఇక నేడు మరోమారు లాక్ డౌన్ ను మే 3 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు . ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు టిటిడి కూడా ఆలయాన్ని మే 3 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి భక్తుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల ఆలయాన్ని మూసేసినప్పటికీ శ్రీవారి నిత్య పూజ, కైంకర్యాలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వాటిని ఏకాంతంగానే నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో మే 3 వరకు స్వామి దర్శనం లేనట్టే . ఆ తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే .

English summary
The Center has decided to increase the lockdown again until May 3. Prime Minister Narendra Modi has announced this. TTD also decided to close the temple till May 3, following a decision by the Center. The Tirumala Tirupati Temple has announced that it has taken the decision of the central government for the protection of the devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X