తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీకి కరోనా సెగ ..గోవిందరాజ స్వామి ఆలయ ఉద్యోగికి కరోనా .. ఆలయం రెండు రోజులు మూసివేత

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. అయినప్పటికీ లాక్ డౌన్ నిబంధనల నుండి సడలింపు ఇచ్చి ఏపీలో అన్ని దేవాలయాలలో భక్తులను అనుమతిస్తున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులకు పరిమిత సంఖ్యలో దర్శనాలను కల్పిస్తోంది. ఇక ఈ క్రమంలో టీటీడీకి కరోనా సెగ తగిలింది.

నేటి నుండి శ్రీవారి దర్శనంతో తిరుమలకు కొత్త కళ .. ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల సందడి ఇలా !! నేటి నుండి శ్రీవారి దర్శనంతో తిరుమలకు కొత్త కళ .. ఉచిత టోకెన్ల కోసం పోటెత్తిన భక్తుల సందడి ఇలా !!

తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో కరోనా కలకలం

తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో కరోనా కలకలం


జూన్ 8వ తేదీ నుండి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ మూడు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించి నిన్నటి నుండే భక్తులకు శ్రీవారి దర్శనాలకు అనుమతినిచ్చింది. ఇక ఈ సమయంలో తిరుపతిలోని గోవిందరాజు స్వామి ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలడం టీటీడీ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. గత రెండు నెలలుగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు లేక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన భక్తులు నిన్నటి నుండే స్వామి దర్శనానికి బారులు తీరుతున్నారు.

గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఉద్యోగి కరోనా పాజిటివ్

గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఉద్యోగి కరోనా పాజిటివ్

ఇక ఇదే సమయంలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్న టీటీడీ అధికారులకు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఉద్యోగి కరోనా పాజిటివ్ రావడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. తిరుమలకు కూడా వివిధ ప్రాంతాలనుండి భక్తులు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న అనుమానం నెలకొంది. టీటీడీ అనుబంధ దేవాలయాల్లో ఒకటైన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పని చేస్తున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం, ఆలయ ఉద్యోగుల్లో టెన్షన్ కు కారణమవుతోంది.

ఆలయాన్ని శానిటైజ్ చేస్తున్న అధికారులు .. రెండు రోజులు మూసివేత

ఆలయాన్ని శానిటైజ్ చేస్తున్న అధికారులు .. రెండు రోజులు మూసివేత

రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఇన్స్పెక్టర్ హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోగా కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ కు తరలించారు.దీంతోతిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని శానిటైజ్ చేస్తున్న అధికారులురెండు రోజులపాటు ఆలయాన్నిమూసేస్తూనిర్ణయం తీసుకున్నారు.ఆలయాన్నిపూర్తి స్తాయిలో శానిటేషన్ చేసిన తరువాత తిరిగి ఆదివారం నుంచి తెరుస్తామనిటీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Recommended Video

#Watch : Long Queue Seen Yesterday In Hyderabad For Famous 'Tirupati Laddu'
ఇక తిరుమలలోనూ టెన్షన్

ఇక తిరుమలలోనూ టెన్షన్

ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరెవరితోకలిసి ఉన్నారు వివరాలు సేకరించి వారిని కూడా క్వారంటైన్ కి పంపే పనిలో ఉంది అధికార యంత్రాంగం. ఇక టీటీడీ కి సంబంధించిన గోవిందరాజు స్వామి ఆలయంలో తాజా పరిస్థితి ఇలా ఉంటే, తిరుమలలో స్వామి ఆలయంలో భక్తుల దర్శనాల నేపథ్యంలో ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన నెలకొంది.

English summary
Corona positive to a sanitation inspector working at the Tirupati Govindarajaswamy temple in one of the TTD affiliated temples , causing tension among the temple employees. Officials sanitizing the Temple have decided to close down for two days. The temple will be reopened from Sunday after a complete sanitation of the temple, TTD said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X