తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్ డౌన్, గోవిందుడి దర్శనానికి గ్రీన్ సిగ్నల్, ఏడుకొండలవాడా!

|
Google Oneindia TeluguNews

తిరుపతి/ చిత్తూరు/ అమరావతి: ప్రపంచ ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుకొండస్వామి నిలయం ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దిగువన ఉన్న టెంపుల్ టౌన్ తిరుపతిలో ఆగస్టు 14వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగించారు. కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో తిరుపతిలో లాక్ డౌన్ పొడగించారు.

అయితే తిరుమల వెళ్లే ఏడుకొండల స్వామి భక్తులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. గోవిందుడి దర్శనానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపులు ఉంటాయని అధికారులు తెలిపారు.

Ayodhya: నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన 150 మంది పోలీసులే నేడు ప్రధాని మోడీకి సెక్యూరిటీ, ఓ లెక్కుందిAyodhya: నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన 150 మంది పోలీసులే నేడు ప్రధాని మోడీకి సెక్యూరిటీ, ఓ లెక్కుంది

 తిరుపతిపై కరోనా పంజా

తిరుపతిపై కరోనా పంజా

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో జులై 20వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేశారు. ఇదే సమయంలో తిరుపతిలో లాక్ డౌన్ అమలు చేసి భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక అధికారులు, స్థానిక ప్రజలు కలిసికట్టుగా కళ్లెం వేశారు.

లాక్ డౌన్ ఫలితం సూపర్

లాక్ డౌన్ ఫలితం సూపర్

తిరుపతిలో సరాసరి రోజుకు 400 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇదే సమయంలో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో తిరుపతిలో ఇప్పుడు సరాసరి 200 కరోనా పాజిటివ్ కేసులకు తగ్గిందని తిరుపతి మునిసిపల్ కమిషనర్ పీఎస్. గిరీష అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా తిరుపతిలో కరోనా వైరస్ కట్టడి కావడంతో ఆగస్టు 14వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగించాలని నిర్ణయించామని తిరుపతి మునిసిపల్ కమిషనర్ పీఎస్. గిరీష చెబుతున్నారు.

భక్తులకు ఇబ్బంది లేదు

భక్తులకు ఇబ్బంది లేదు

తిరుమల కొండకు వెళ్లే భక్తులు వారివారి వాహనాల్లో తిరుపతి బైపాస్ రోడ్డు మీదుగా తిరుమలకు ప్రయాణించడానికి ఏర్పాట్లు చేశారు. తిరుమల ఆర్ టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ప్రజలు సైతం తిరుమల వెళ్లే భక్తులకు సహకరిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు.

బయటకు రావాలంటే షరతులు

బయటకు రావాలంటే షరతులు

ఆగస్టు 14వ తేదీ వరకు తిరుపతి ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని, కరోనా వైరస్ ను తిరుపతిలో పూర్తిగా అరికట్టడానికి ప్రజలు సహకరించాలని తిరుపతి మునిసిపల్ కమిషనర్ పీఎస్. గిరీష స్థానిక ప్రజలకు మనవి చేశారు. తిరుపతి ప్రజలకు వారికి అవసరమయ్యే నిత్యవసర వస్తువులు, కూరగాయాలు, పండ్లు, పాలు తదితర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల లోపు తీసుకోవాలని, ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, తరువాత ప్రజలు వారివారి ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.

Recommended Video

Donald Trump : Facebook Twitter Removed Donald Trump's Post Over False Claim || Oneindia Telugu
సినిమా చూపించిన తమిళనాడు

సినిమా చూపించిన తమిళనాడు

తమిళనాడు రాష్ట్రం సరిహద్దులోనే తమిళనాడు రాష్ట్రం ఉంది. తమిళనాడులో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక చెన్నై సిటీలో ఇప్పటికే కరోనా వైరస్ సినిమా చూపిస్తోంది. తమిళనాడు నుంచి అక్రమంగా చిత్తూరు జిల్లాలోకి ప్రజలు రాకపోకలు సాగించడం వలనే చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరిగిపోయాయని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Coronavirus: lockdown in Tirupati has further been extended till August 14, an official of the Municipal Corporation said here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X