తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tirupati lockdown: కరోనా కల్లోలం, భక్తులకు బైపాస్, చెన్నై దెబ్బతో గోవిందా గోవింద, నో కాంప్రమైజ్ !

|
Google Oneindia TeluguNews

తిరుపతి/ చిత్తూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుకొండస్వామి నిలయం ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దిగువన ఉన్న టెంపుల్ టౌన్ (సిటీ) తిరుపతిలో లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో తిరుపతిలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. అయితే తిరుమల వెళ్లే స్వామివారి భక్తులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బైపాస్ లో పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పరిపాలన విభాగం అధికారులు, తిరుపతి అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 5వ తేదీ వరకు తిరుపతిలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు.

Coronavirus: మనోళ్ళు మేధావులు, వజ్రాలతో మాస్క్ లు, కరోనాకు బంగారు అంటే భయమా ? ఎవడి పిచ్చి !Coronavirus: మనోళ్ళు మేధావులు, వజ్రాలతో మాస్క్ లు, కరోనాకు బంగారు అంటే భయమా ? ఎవడి పిచ్చి !

తిరుపతికి తమిళనాడు దెబ్బ

తిరుపతికి తమిళనాడు దెబ్బ

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో చిత్తూరు జిల్లా ఉంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలోకి నియమాల ప్రకారం కొందరు వచ్చారు. ఇదే సమయంలో నియమాల ప్రకారం వచ్చిన వారితో పాటు తమిళనాడు నుంచి కొన్ని వేలమంది అక్రమ మార్గాల్లో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు దెబ్బతో ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ తాండవం చేస్తోంది.

చిత్తూరు జిల్లాలో 5, 400 పాజిటివ్ కేసులు

చిత్తూరు జిల్లాలో 5, 400 పాజిటివ్ కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంది. అయినా టెంపుల్ టౌన్ తిరుపతికి, ఏడుకొండవాడు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చివెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు (జులై 20వ తేదీ సోమవారం) వరకు 5, 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్వయంగా వెళ్లడించారు.

తిరుపతి ప్రజలు హడల్

తిరుపతి ప్రజలు హడల్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5, 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఒక్క తిరుపతి నగరంలో మాత్రమే 1, 700కు పైగా కరోపా పాజిటివ్ కేసులు నమోదైనాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మీడియాకు చెప్పారు. తిరుపతిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పట్టణ ప్రజలు ఆందోళకు గురైనారు.

లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం !

లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం !


తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి, తిరుపతి మునిసిపల్ కమీషనర్ పీఎస్, గిరీష, ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత అధికారులు సమావేశమైనారు. తిరుపతిలో కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యాలంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం అని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. తిరుపతిలో వెంటనే లాక్ డౌన్ అమలు చెయ్యాలని అధికారులు నిర్ణయించారు.

ఆగస్టు 5వ వరకు లాక్ డౌన్

ఆగస్టు 5వ వరకు లాక్ డౌన్


ఆగస్టు 5వ తేదీ వరకు 15 రోజుల పాటు తిరుపతిలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మీడియాకు చెప్పారు. అయితే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా హామీ ఇచ్చారు.

 బైపాస్ లో తిరుమలకు ఎంట్రీ

బైపాస్ లో తిరుమలకు ఎంట్రీ


తిరుమల కొండకు వెళ్లే భక్తులు వారివారి వాహనాల్లో తిరుపతి బైపాస్ రోడ్డు మీదుగా తిరుమలకు ప్రయాణించడానికి ఏర్పాట్లు చేశామని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు తిరుపతి ప్రజలు సంపూర్ణ లాక్ డౌన్ కు సహకరించాలని, కరోనా వైరస్ ను తిరుపతిలో పూర్తిగా అరికట్టడానికి ప్రజలు సహకరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రజలకు మనవి చేశారు.

Recommended Video

#Watch COVID Asymptomatic Patients Flash Mob| Pune Girl Grand Welcome to Sister- Videos Viral
 అలిపిరిలో అలర్ట్

అలిపిరిలో అలర్ట్

తిరులమకు వెళ్లే భక్తులకు అలిపిరి ప్రవేశ మార్గంలో అన్ని వైద్యపరీక్షలు నిర్వహించి స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తులు అలిపిరిలో టీటీడీ, పోలీసు అధికారులు, సిబ్బందికి పూర్తిగా సహకరిస్తున్నారు. తిరుపతిని త్వరలో గ్రీన్ జోన్ చెయ్యాలని అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

English summary
Tirupathi lockdown: With a spike in COVID-19 cases in recent days, this temple town of Tirupati in Andhra Pradesh was brought under complete lockdown from Monday till August 5 to check its spread, Chittoor District administration said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X