తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus: టీటీడీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్, ఉగాదికి ఒక్కో ఉద్యోగికి పది లడ్డూలు

|
Google Oneindia TeluguNews

తిరుమల శ్రీవారి ప్రసాదంపై కూడా వైరస్ ప్రభావం చూపింది. శుక్రవారం నుంచి ఆలయం మూసివేయడంతో లడ్డూ అలాగే ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ప్రతీ రోజు 80 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ప్రతీ రోజు 3 నుంచి మూడున్నర లక్షల వరకు లడ్డూలు విక్రయిస్తుంటారు. లడ్డూ పోటులో దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు లడ్డూలను నిల్వ చేసి ఉంచుతారు.

శ్రీవారి లడ్డూ..

శ్రీవారి లడ్డూ..

తిరుమల శ్రీవారి లడ్డూ అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైనా తిరుమల వెళ్తున్నామని చెబితే చాలు.. లడ్డూ ప్రసాదం మరవొద్దని చెబుతుంటారు. అంతటి విశిష్టత కలిగిన లడ్డూ.. భక్తులు రాక, ఆలయం మూసివేయడంతో అలాగే ఉండిపోయాయి. 2.40 లక్షల లడ్డూలు నిల్వ ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వివరించారు. తిరుమలకు భక్తులు రాకపోవడం, తిరుమల, తిరుపతిలో ఆ స్థాయిలో లడ్డూలు అందజేసే వీలులేకపోవడంతో టీటీడీ సిబ్బందికి అందజేయాలని అధికారులు నిర్ణయించారు.

ఉగాది సందర్భంగా..

ఉగాది సందర్భంగా..


టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఒక్కో ఉద్యోగికి తలా పది లడ్డూలు ఇవ్వాలని టీటీడీ తెలిపింది. తిరుపతిలో ఉన్న వెయ్యి మంది సిబ్బందికి అక్కడే తలా 10 లడ్డూలను అందజేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తిరుపతిలో గల పరిపాలన భవనంలో ఉంటారు. 8 వేల పైచిలుకు ఉద్యోగులు ఉండటంతో.. అక్కడే వారికి లడ్డూలు అందజేసేందుకు పరిపాలనా భవనానికి లడ్డూలు తరలించారు. ఉగాది పర్వదినం రోజున వారికి లడ్డూలను అందజేస్తారు. పండగ రోజున శ్రీవారి ప్రసాదం ఉచితంగా రావడంతో కుటుంబసభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంది.

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
రూ.కోటి నష్టం

రూ.కోటి నష్టం

రిటైర్డ్ ఉద్యోగులకు కూడా లడ్డూ ప్రసాదం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. 2.40 లక్షల లడ్డూలతో టీటీడీకి రూ.కోటి నష్టం వస్తోంది. కానీ తిరుమల ఆలయం మూసివేయడం, మళ్లీ తెరిచే తేదీపై స్పష్టత లేకపోవడంతో.. అప్పటివరకు లడ్డూలు నిల్వ ఉంటాయో లేదోననే సందేహాం నెలకొంది. అందుకే ఉద్యోగులకు పండగ పూట అందజేస్తే గుర్తుంచుకొంటారని భావిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగులు నెలకు 10 లడ్డూలు రూ.20 చొప్పున అందజేస్తారు. కానీ ప్రత్యేక సమయంలో భక్తులకు లడ్డూలను అందజేయబోతున్నారు.

English summary
ttd distribute 10 laddus their each one employee on ugadi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X