తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈజ్ ఆఫ్ లివింగ్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్: ఏపీలోని బెస్ట్ సిటీలు ఇవే: తెలంగాణలో జీరో

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహిస్తోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ మున్సిపాలిటీల జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలు, మున్సిపాలిటీలతో కూడిన లిస్ట్ అది. ఈ జాబితాలో రాష్ట్రంలోని మూడు నగరాలకు చోటు లభించింది. వాటికి టాప్-10లో స్థానం దక్కింది. తెలంగాణలోని ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గానీ, మున్సిపాలిటీ గానీ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కొద్ది సేపటి కిందటే దేశ రాజధానిలో ఈ జాబితాను విడుదల చేశారు.

కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుపై ఏం చేస్తారు?కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుపై ఏం చేస్తారు?

రెండు వేర్వేరు జాబితాలు..

రెండు వేర్వేరు జాబితాలు..

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ పేరుతో కేంద్రమంత్రి రెండు వేర్వేరు జాబితాలను విడుదల చేశారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ల.. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాల పేర్లను చేర్చారు. మళ్లీ వాటిని రెండు విభాగాలుగా చేశారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను ఒక కేటగిరీలో.. 10 లక్షల కంటే తక్కువగా జనాభా ఉన్న సిటీలను మరో కేటగిరీలోకి చేర్చారు. మొదటి కేటగిరీలో రాష్ట్రంలో ఏ ఒక్క నగరానికి కూడా చోటు దక్కలేదు.

 రెండో కేటగిరీలో కాకినాడకు నాలుగో ర్యాంక్..

రెండో కేటగిరీలో కాకినాడకు నాలుగో ర్యాంక్..

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న జనాభా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు-66.70, పుణే-66.27, అహ్మదాబాద్-64.87, చెన్నై-62.61, సూరత్-61.73, నవీ ముంబై-61.60, కోయంబత్తూరు-59.72, వడోదర-59.24, ఇండోర్-58.58, గ్రేటర్ ముంబై-58.23 టాప్‌-10లో ఉన్నాయి. 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న జాబితాలో కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నగరానికి 56.84 పాయింట్లు లభించాయి. తొలిస్థానంలో సిమ్లా-60.90, భువనేశ్వర్-59.85, సిల్వాస-58.43, సేలం-56.40, వేలూరు-56.38, గాంధీనగర్-56.25, గురుగ్రామ్-56.00, దావణగెరె-55.25 ఉన్నాయి.

మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో విశాఖ, తిరుపతి

మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో విశాఖ, తిరుపతి

మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో విశాఖపట్నం, తిరుపతిలు టాప్-10లో నిలిచాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో విశాఖ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ నగరానికి 52.77 పాయింట్లు వచ్చాయి. ఈ లిస్ట్‌లో ఇండోర్-66.08, సూరత్-60.82, భోపాల్-59.04, పింప్రి ఛించ్వాడ్-59.00, పుణే-58.79, అహ్మదాబాద్-57.60, రాయ్‌పూర్-54.98, గ్రేటర్ ముంబై-54.36, వడోదర-52.68 ఉన్నాయి. 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న అత్యుత్తమ మున్సిపాలిటీల లిస్ట్‌లో తిరుపతి రెండో స్థానంలో నిలిచింది. తిరుపతికి 51.69 పాయింట్లు వచ్చాయి. న్యూఢిల్లీ-52.92, గాంధీనగర్-51.59, కర్నాల్-51.39, సేలం-49.04, తిరుప్పూర్-48.92, బిలాస్‌పూర్-47.99, ఉదయ్‌పూర్-47.77, ఝాన్సీ-47.04, తిరునెల్వేలి-47.02 పాయింట్లు లభించాయి.

English summary
Center releases the final rankings of Ease of Living Index 2020 and the Municipal Performance Index (MPI) 2020. Vishakapatnam number 9 in MPI of above 10 lakh population. Tirupati number 2 in less than 10 lakh population and kakinada number 4. None from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X