తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల శ్రీవారి మెట్లపై నెత్తుటి మరకలు.. 270వ మెట్టు దగ్గర భీకర దృశ్యం.. భయాందోళనలో భక్తులు..

|
Google Oneindia TeluguNews

ప్రఖ్యాత తిరుమలలో బ్రహ్మాండనాయకుడి దర్శనం కోసం మెట్లమార్గంలో వెళ్లిన భక్తులు.. అక్కడి భీకర దృశ్యాన్ని చూసి భయపడిపోయారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలోని 270 మెట్టు దగ్గర సోమవారం ఉదయం దట్టంగా నెత్తుటి మరకలు పేరుకుపోవడం అందరినీ కలవరపెట్టింది. భక్తుల ఫిర్యాదుతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు.. విజిలెన్స్ విభాగం ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం..

శ్రీవారి మెట్ల మార్గంలో అందరినీ షాక్ కు గురిచేసిన ఆ రక్తపు మరకలు.. దుప్పివని తెలుస్తోంది. మెట్ల మార్గంలో చాలా కాలంగా చిరుతపులి సంచరిస్తుండటం, కొన్ని నెలల కింద తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులపై చిరుత దాడి చేయడం తెలిసిందే. దుప్పిని వేటాడింది కూడా చిరుతపులే అయిఉండొచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అది వేటగాళ్ల రేసు కుక్కల పని కూడా అయి ఉండొచ్చనే అనుమానాల్ని వారు వ్యక్తం చేశారు. ఆ మేరకు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.

fear in tirumala devoties as deer killed at srivari mettu, ttd vigilance enquiring matter

తిరుమల కొండపైకి వెళ్లే రెండు మార్గాల్లో అలిపిరి మార్గం, శ్రీవారి మెట్ల మార్గం ప్రధానమైనవి. మెట్ల మార్గంలోని అటవీప్రాంతంలో జంతువులు సంచరిస్తుంటాయి కాబట్టి రాత్రి వేళల్లో ఈ మార్గంలోకి భక్తుల్ని అనుమతించరు. సోమవారం నాటి చిరుత దాడి నేపథ్యంలో మెట్ల మార్గంలో భద్రత కట్టుదిట్టం చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

English summary
tirumala devoties got schoked after seeing blood stains on sreevari metru, tirumala walk way. ttd vigilence officials said, a deer was alleggedly killed by Cheetah
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X