• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆసక్తికరంగా తిరుపతి పోరు- వైసీపీకి టీడీపీ, జనసేన సాయం- ఎలాగో తెలుసా ?

|

ఏపీలో తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన సునామీ వెనుక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జగన్ పాలన, విపక్షాల వైఫల్యం.. వీటన్నంటికీ మించిన ఎన్నో అంశాలున్నాయి. కానీ వాటిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఊహించిన స్ధాయిలో చర్చ జరగడం లేదు. కానీ రాబోయే తిరుపతి ఉపఎన్నికల్లో విజేతను కూడా సరిగ్గా అవే అంశాలు నిర్ణయించబోతున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. పైకి చూసేందుకు మున్సిపల్‌ ఎన్నికల ఫీట్‌ను వైసీపీ రిపీట్ చేసేలా ఉన్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వీటిపైనే స్ధానికంగా చర్చ జరుగుతోంది.

 తిరుపతిలో ఏం జరగబోతోంది ?

తిరుపతిలో ఏం జరగబోతోంది ?

వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ మరణంతో ఖాళీ అయిన తిరుపతి పార్లమెంటు స్ధానంలో వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందులో వైసీపీ, టీడీపీతో పాటు జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి కూడా రంగంలో ఉండబోతున్నారు. వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక లక్ష్మి ఇప్పటికే అభ్యర్ధులుగా ఖరారైపోయారు. దీంతో ఇక మిగిలింది జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి మాత్రమే. ఎలాగో బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపేందుకు జనసేన కూడా అంగీకరించింది. అయితే బీజేపీ-జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్ధిపైనా మల్లగుల్లాలు తప్పడం లేదు. ఇదంతా ఓ ఎత్తయితే మున్సిపల్ పోరులో చిత్తుచిత్తుగా ఓడిన విపక్షాలు తిరుపతిలో వైసీపీకి పోటీ ఇచ్చేందుకు ఎలా సిద్ధమవుతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

 మున్సిపల్‌ ఫీట్‌ను వైసీపీ రిపీట్ చేస్తుందా ?

మున్సిపల్‌ ఫీట్‌ను వైసీపీ రిపీట్ చేస్తుందా ?

తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి బలంగా వీచింది. పలు చోట్ల ప్రత్యర్ధులు కకావికలు అయ్యారు. కనీస పోటీ ఇవ్వలేని పరిస్ధితుల్లో విపక్షాలు చేతులెత్తేశాయి. అయితే ఇదంతా ఓ ఎత్తు. ఇప్పుడు బ్యాలెట్‌కు బదులుగా ఈవీఎం విధానంలో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నికలు ఓ ఎత్తు. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్‌ పోరులో సునామీ సృష్టించిన వైసీపీ తిరుపతిలోనూ కార్పోరేషన్‌ను అలవోకగా చేజిక్కించుకుంది. అయితే ఇదే ఫీట్‌ తిరుపతి ఉపఎన్నికలోనూ రిపీట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం వైసీపీ చెప్పుకుంటున్న ప్రభుత్వ సంక్షేమం, జగన్‌ పాలన మాత్రమే కాదు అంతకు మించిన కారణాలు కనిపిస్తున్నాయి.

మున్సిపోల్స్‌లో టీడీపీ విజయాల్ని అడ్డుకున్న జనసేన

మున్సిపోల్స్‌లో టీడీపీ విజయాల్ని అడ్డుకున్న జనసేన

తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోరులో జనసేన పోషించిన పాత్ర ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగా కనిపించిన జనసేన.. మున్సిపల్‌ పోరులో మాత్రం చాలా చోట్ల కీలకంగా కనిపించింది. దీనికి కారణం కాపు ఓటు బ్యాంకులో వచ్చిన మార్పే. గతంలో వైసీపీతో పాటు టీడీపీకి ఓటేసిన కాపులు ఈసారి మున్సిపల్‌ పోరులో తమ సామాజిక వర్గ అభ్యర్ధులకే అండగా నిలిచారు. దీంతో వైసీపీ కంటే టీడీపీయే ఎక్కువగా నష్టపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీ, జనసేన చీల్చుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశం తిరుపతిలోనూ కాకరేపేలా ఉంది.

తిరుపతిలోనూ గేమ్ స్పాయిలర్‌గా జనసేన

తిరుపతిలోనూ గేమ్ స్పాయిలర్‌గా జనసేన

మున్సిపల్‌ ఎన్నికల పోరులో చాలా చోట్ల టీడీపీ ఓట్లను భారీగా కొల్లగొట్టిన జనసేన ఇప్పుడు తిరుపతి పోరులోనూ అదే పని చేసేందుకు సిద్ధమవుతోంది. తాను బలపడాలన్న ఆతృతలో జనసేన చేస్తున్న ప్రయత్నాలు అంతిమంగా టీడీపీ ఉసురు తీస్తున్నాయి. పలు చోట్ల టీడీపీ అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. మున్సిపల్‌ పోరులో ఒక్క విజయవాడ కార్పోరేషన్‌లోనే జనసేన నిలబెట్టిన అభ్యర్ధులు 20 స్దానాల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యారు. ఇక్కడ జనసేన సాధించిన ఓట్లకూ వైసీపీ అభ్యర్ధుల మెజారిటీకి అస్సలు పొంతనే లేకుండా పోయింది. ఇప్పుడు తిరుపతిలోనూ జనసేన ఓట్లు జనసేనకే పడితే మాత్రం టీడీపీకి మరోసారి గండి పడక తప్పదు.

తిరుపతిలో వైసీపీకి టీడీపీ, జనసేన సాయం

తిరుపతిలో వైసీపీకి టీడీపీ, జనసేన సాయం

తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోటీలో ఉండబోతున్న టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు పరోక్షంగా వైసీపీకి సాయం చేస్తున్నట్లే కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య పొత్తు లేకపోవడం, ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణాలు. అధికార వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీతో కలిసి పోటీ చేయాల్సిన జనసేన.. తప్పనిసరి పరిస్దితుల్లో బీజేపీతో కలిసి సాగుతుండగా.. అటు జనసేనను కలుపుకోవాల్సిన టీడీపీ మాత్రం దిక్కులు చూస్తోంది. దీంతో వీరిద్దరూ భారీగా ఓటు బ్యాంకుల్ని చీల్చుకుంటూ వైసీపీని తిరుపతి పోరులో విజేతగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
upcoming byelection for tirupati loksabha constituency turns interesting after jansena's vote division affect benefits ysrcp in recently concluded municipal elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X