తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల శ్రీవారి ఆలయంపై తప్పుడు ప్రచారం: చంద్రబాబుకు తడాఖా చూపిస్తా: బీజేపీ ఎంపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంపై సాగుతోన్న దుష్ప్రచారంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన మీడియా పనిగట్టుకుని తిరుమల శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారం సాగిస్తోందని మండిపడ్డారు. దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం వల్లే ఆయన అనుకూల మీడియా శ్రీవారి ఆలయం ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోందని ధ్వజమెత్తారు.

 జూమ్‌ను వదలని చంద్రబాబు: వర్చువల్ మ్యారేజ్: ఆన్‌లైన్‌లోనే వధూవరులకు బ్లెస్సింగ్స్ జూమ్‌ను వదలని చంద్రబాబు: వర్చువల్ మ్యారేజ్: ఆన్‌లైన్‌లోనే వధూవరులకు బ్లెస్సింగ్స్

చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వల్లే తిరుమల శ్రీవారి ఆలయంపై యథేచ్ఛగా దుష్ప్రచారం సాగుతోందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఒక వర్గం మీడియా ఇష్టానుసారంగా వార్తలను ప్రచురిస్తోందని, తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని చెప్పారు. టీటీడీపై తప్పుడు ప్రచారంతో తాను విసిగిపోయానని, ఇక చూస్తూ ఉండబోనని హెచ్చరించారు. త్వరలోనే తిరుపతి న్యాయస్థానంలో పరువునష్టం దావా వేయబోతోన్నట్లు తెలిపారు. తన సహచరుడు, న్యాయవాది సత్యపాల్ సబర్వాల్ ద్వారా త్వరలో చంద్రబాబు అనుకూల మీడియాకు నోటీసులను అందజేస్తానని అన్నారు.

I am fed up getting false TDP and CBN financed stories on TTD Balaji temple, says BJP MP

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. తిరుమల, శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారం సాగుతోందని, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతిపరులే కారణమనే అభిప్రాయాలు ఇదివరకు వినిపించిన విషయం తెలిసిందే. తిరుమలలో యథేచ్ఛగా అన్యమత ప్రచారం సాగుతోందని, ఏడుకొండలపై చర్చిని నిర్మిస్తున్నారంటూ ఇదివరకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శిలువను పోలిన విద్యుద్దీపాలతో అలంకరించారంటూ ప్రచారం సాగింది. ఈ వార్తలు సుబ్రహ్మణ్య స్వామికి ఆగ్రహం తెప్పించాయని తెలుస్తోంది.

English summary
Bharatiya Janata Party leader and Rajya Sabha member Subrahmanya Swamy says that he fed up getting false Telugu Desam Party and Chandrababu Naidu financed stories on TTD Balaji Temple. He warned that he will file a defamation case in Tirupati town magistrate’s court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X