తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నేను మోడీని కలిస్తే జగన్ పార్టీ ఎక్కడ ఉండేది?: చంద్రబాబు నిస్సహాయంగా తిరుగుతున్నారు’

|
Google Oneindia TeluguNews

తిరుపతి: జనసేన పార్టీ కోసం జెండా కట్టిన జన సైనికుల కోసం సొంత రక్త సంబంధాన్ని వదులుకునేందుకు సైతం తాను సిద్ధమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ ఆత్మీయ యాత్రలో భాగంగా తిరుపతిలో కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

వందలరోజులు జైల్లో ఉన్న జగనే సీఎం అయ్యారు: అద్భుతాలు ఆశించొద్దంటూ పవన్ కళ్యాణ్వందలరోజులు జైల్లో ఉన్న జగనే సీఎం అయ్యారు: అద్భుతాలు ఆశించొద్దంటూ పవన్ కళ్యాణ్

నా ప్రాణాలు పోయినా పర్వాలేదు..

నా ప్రాణాలు పోయినా పర్వాలేదు..

‘రాయలసీమ ప్రాంతంలో తమ కార్యకర్తలపై దాడులు చేస్తే, జన సైనికుల కోసం సీమలో గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తానని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.
మనలో గుండె ధైర్యం లేకపోతే మార్పు రాదనీ, అలా అని ఎవరూ గొడవలకు దిగవద్దని కార్యకర్తలకు సూచించారు. ప్రత్యర్ధులు స్థాయి దాటి ప్రవర్తిస్థే మాత్రం మీ కోసం ఊరూరా తిరుగుతానని భరోసా ఇచ్చారు. ఆ ప్రయాణంలో తన ప్రాణాలు పోయినా పర్వా లేదన్నారు' పవన్ కళ్యాన్ అన్నారు.

నాకు ఆ భయం లేదు..

నాకు ఆ భయం లేదు..

‘పవన్ కళ్యాణ్ సర్వం తెగించిన వ్యక్తి. నా బిడ్డలు ఏమవుతారు. ఆస్తులు ఏమవుతాయన్న భయం నాకు లేదు. మా కార్యకర్తల మీద దాడులు చేసే వైసీపీ నాయకులు మీ బిడ్డలను, మీ కుటుంబాలను వదిలి రాగలరా? మీకు ఎంత కాలం ఊడిగం చేయాలి. 151 సీట్లు వచ్చాయని విర్రవీగితే ఎంత వరకు తెగించేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా. అంబేద్కర్ స్ఫూర్తితో మేం సింహాల్లాగా బతుకుతాం. జనసేనలో సేన అంటే సైనిక సమూహం. సైనికుడికి యుద్ధమే తెలుసు. అలాగని కయ్యానికి కాలు దువ్వవద్దు. వాళ్లు మనమీదకి వస్తే మాత్రం సంఘటితంగా పోరాటం చేయండి. అదే మార్పు తీసుకువస్తుంది. సీమ యువత ఊర్లు వదిలి వెళ్లకుండా ఇక్కడే ధైర్యంగా ఉండండి మీ కోసం నేను ఉంటాను. మీరు త్యాగాలు చేయండి.. నేను ముఖ్యమంత్రి అవుతా అని ఎప్పుడూ అడగను. నేను సమాజం కోసం సేవ చేస్తూ ముందుకు వెళ్తా. మీకు కష్టంగా ఉంటే నా కోసం ఒక భావన పెట్టండి. నేను మాత్రం పిరికితనంతో బతకను. విశాఖలో వీధి నాటకాలు వేసినప్పుడే రాయలసీమలో పోరాటాల గురించి నాకు తెలుసు' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

సీమలో మానవ హక్కుల ఉల్లంఘనలు

సీమలో మానవ హక్కుల ఉల్లంఘనలు


‘రాయలసీమ ప్రత్యేక నేపథ్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇంత మంది వచ్చినా యువత నేటికీ బతుకు మీద భయంతోనే ఎందుకు బతుకుతోంది? ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగదు. యువత ఎందుకు కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వలసలు పోతున్నారు? ఎందుకు పరిశ్రమలు రావు? నదులు, తటాకాలు ఉన్నా జనం ఎందుకు పారిపోతున్నారు? అంటే జనసేన పార్టీ కోసం పని చేస్తే రూ. 50 లక్షలు విలువ చేసే భూమిని వైసిపి నాయకులు లాక్కుంటారు. మా ఆధిపత్యమే నడవాలి, మీరంతా మా మోచేతి కింద నీరు తాగాలి, మీకు స్వేచ్చ ఉండదు.. అనే చందంగా పరిస్థితులు కల్పించారు. ఇలాంటి మానవహక్కుల ఉల్లంఘన కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇక్కడ కులం, మతం లేదు. మా వర్గం కాకపోతే మీ ఆస్తులు లాక్కుంటాం అంతే. ఇక్కడ యువతకు నేను చెబుతున్నా ఇది రాయలవారు ఏలిన గొప్ప నేల. కుందేళ్లు రేసు కుక్కలను తరిమిన నేల. అహోబిలం నారసింహుడు నడయాడిన నేల. నా ఆధిపత్యంలో అంతా నలిగిపోవాలి అన్న ఆలోచన వచ్చిన రోజున ప్రకృతి నరసింహుడిలా ఏదో ఒక అవతారంలో వచ్చి అసుర సంహారం చేస్తుంది. మీకు ఎప్పుడు అధైర్యం వచ్చినా నరసింహుడిని తలచుకోండి. ఒక్క పిలుపుతో పోరాటం చేసేందుకు మూడు లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. ఓట్లు ఎందుకు వేయలేదు అంటే మాకు భయం అన్నా అని చెబుతున్నారు. ఒక్క రోజులో ఎలాంటి మార్పు రాదు. ఇలాంటి సమూహాన్ని ఎదుర్కోవాలంటే దానికి కాలమే సమాధానం చెబుతుంది. కాలం ఇచ్చే పరీక్షలు తట్టుకుని నిలబడితే రేపు రైల్వే కోడూరులో బలమైన నాయకత్వం వస్తుంది. సామాన్యుడు కన్నీరు పెట్టకుండా గుండె ధైర్యంతో ముందుకు వెళ్లాలి అన్నదే నా కోరిక. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ముఖ్యమంత్రిలా మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా?

ముఖ్యమంత్రిలా మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా?


‘మాట్లాడితే మానవత్వం నా మతం అని జగన్ రెడ్డి గారు చెబుతారు. పచ్చని చెట్లు నరికేయడమేనా మీ మానవత్వం. మాట తప్పని కులం అంటారు.. మిగిలిన కులాలు మాట తప్పుతాయా? ఇలాంటి మాటలు మాట్లాడుతారు కాబట్టే మీకు ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వను. అసలు మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించారా? ఆయన భాష సరిగ్గా ఉంటుందా? 150 మంది వైసిపి నాయకులు గుర్తుపెట్టుకోండి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు సైతం జనం తిరగబడిన రోజున కూలిపోయాయి' అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

నేను మోడీని కలిస్తే వైసీపీ ఎక్కడ ఉండేది?

నేను మోడీని కలిస్తే వైసీపీ ఎక్కడ ఉండేది?

‘పార్టీలోకి నాయకులంతా ఆరు నెలల ముందు వచ్చారు. ముందు నుంచి ఉన్నది సైనికులే. నెల రోజుల ముందు వచ్చి నిర్మాణం జరగలేదు అంటే ఎలా? నలుగురు బిడ్డల్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడమే కష్టం. అలాంటిది ఇన్ని కోట్ల మందిని సమన్వయ పర్చడానికి ఎంత కష్టపడాలి. అందుకే నేను అధికారం కోసం వెంపర్లాడను. అనుభవం వచ్చే వరకు వేచి చూస్తా. ఆశయం కోసం మాత్రమే పోరాటం చేస్తాం. ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి నేను ప్రత్యేక హోదా వ్యవహారంలో మీ మనసు నొప్పించేలా మాట్లాడాను. ఇక నుంచి కలిసి పని చేద్దాం అంటే వైసిపి ఎక్కడ ఉండేది' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

చంద్రబాబు నిస్సహాయంగా తిరుగుతున్నారు..

చంద్రబాబు నిస్సహాయంగా తిరుగుతున్నారు..


‘మాట్లాడితే బాబు బి టీం అంటారు. ఇప్పటికే చంద్రబాబు ఓడిపోయి నిస్సహాయంగా తిరుగుతున్నారు. 30 వేల కోట్లు ప్రజలకు పంచినా ఓడిపోయారు. అసలు టీడీపీ ఓటమి 2018 మంగళగిరి ఆవిర్భావ సభలోనే ఖాయం అయిపోయింది. ఒకప్పుడు వారు గెలవాలని కోరుకున్న వాడు వారి పక్క నుంచి వెళ్లిపోయాడు. టీడీపీని తిట్టి కలిసి ఎలా పోటీ చేస్తాం. నిజానికి వైసిపికి గెలిచేంతటి బలం లేదు. వైసిపికి బలం ఉంటే నాలుగు నెలల్లో మన కోసం రెండు లక్షల మంది జనం ఒక చోటుకు రారు. అలా అని నేను వ్యూహాలు వేయలేక తెలివితేటలు లేక కాదు. నేను ఆశయాలు పాటిస్తా. ఒంటరిగా నిలబడతా. దెబ్బలు తింటా. మార్పు అనేది మీ గుండె లోతున నుంచి వస్తే బలంగా ఉంటుంది. అలాంటి మార్పు వచ్చే వరకు వేచి చూస్తా' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

బీజేపీకి అంటగడతారా?.. జగన్ రెడ్డి లాంటి వారిగురించే..

బీజేపీకి అంటగడతారా?.. జగన్ రెడ్డి లాంటి వారిగురించే..


‘సమస్య కొంత మంది హిందువుల వల్ల వచ్చింది అంటే దాన్ని సాక్షి టీవీ, వైసిపి నాయకులు బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు. అసలు సెక్యులరిజం అంటే అన్ని కులాలకు సమాన హక్కులు ఇవ్వడం. ఒక మతాన్ని చంపి రెండు మతాలను వెనకేసుకురావడం కాదు. రాజ్యాంగం ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కు అయినా, హిందూ అయినా అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. వాటిని పరిరక్షించకపోతే మనకి అన్యాయం జరిగినట్టే. పేరుకే సెక్యులరిజం మన దేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలు మైనారిటీలుగానే బతుకుతున్నారు. పదవులు అనుభవించే వారు మినహా. ప్రజల్లో ఉన్న అభద్రతా భావమే మైనారిటీలు అంటే. అన్ని కులాలు, మతాలు మంచివే. అందులో ఉన్న జగన్ రెడ్డి గారి లాంటి కొద్ది మంది గురించే నేను మాట్లాడుతున్నా. కులాలను, మతాలను మీ అధికారం కోసం వాడుకునే వ్యక్తులనే నేను అంటాను' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

జార్జి బుష్ రెడ్డి అని పిలుస్తామా?.. మతమే లేనప్పుడు కులం ఎందుకు?

జార్జి బుష్ రెడ్డి అని పిలుస్తామా?.. మతమే లేనప్పుడు కులం ఎందుకు?

జగన్ రెడ్డికి మళ్లీ చెబుతున్నా మతం కావాలి అంటే కులాన్ని వదిలేయండి. కులం హిందూయిజంలో మాత్రమే ఉంటుంది. క్రిస్టియానిటీలో ఉండదు. జార్జిబుష్ రెడ్డి అని పిలుస్తామా? మీరు చెప్పినట్టు మా కులం మాట తప్పదు అంటే మిగిలిన కులాలు మాట తప్పుతాయా? అన్ని మతాలు, కులాలు ఓట్లు వస్తేనే ముఖ్యమంత్రి అవుతారు. అంతే బాధ్యతగా పని చేయాలి. జనసేనలో అన్ని కులాలు, మతాల వారు ఉన్నారు. మేం రాజ్యాంగం పొందు పరిచిన హక్కులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.

మాట్లాడితే ఓట్లు పోతాయన్న భయం నాకు లేదు

మాట్లాడితే ఓట్లు పోతాయన్న భయం నాకు లేదు


‘అన్ని మతాచారాలను గౌరవించాలని మాత్రమే కోరుకుంటా. కడప దర్గాకు వెళ్తే అక్కడ సంప్రదాయమే పాటిస్తాం, వేదపండితులు ఆశీర్వచనాలు ఇస్తే హిందూ మత ధర్మం అనుసరిస్తాము.. చర్చికి వెళ్తే మోకాళ్ల మీద కూర్చుని ప్రార్ధిస్తాం. ముక్కోటి దేవతలను సమదృష్టితో చూడగలిగే నేల మనది. ఏడు కొండల వాడి దగ్గరకు వెళ్లి జై జీసెస్ అనగలమా? అయితే అదే విషయాన్ని మాట్లాడాలంటే మనకి ఓట్లు పోతాయన్న భయం. ఏం మాట్లాడితే ఏ వర్గానికి కోపం వస్తుందోనని భయం. నేను వివేకానందుడి స్ఫూర్తితో పెరిగా. సత్యమే మాట్లాడుతా. సామాజిక రుగ్మతల మీద బలంగా మాట్లాడుతా. నిర్భయంగా మాట్లాడితేనే ఈ దేశం తాలూకు ధర్మం బయటకు వస్తుంది' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మీరు బూతులు తిట్టవచ్చా?

మీరు బూతులు తిట్టవచ్చా?


‘నాకు అన్ని కులాల మీదా గౌరవం ఉంది. మరి ముఖ్యమంత్రికి జగన్ రెడ్డి అంటే ఎందుకు కోపం వస్తుందో అర్ధం కావడం లేదు. నాకు ఆయన్ని అవమానపర్చాలన్న ఆలోచన గానీ, ఆయన మీద ద్వేషంగానీ లేవు. వైసిపి నేతలు ఎందుకు అలా ఫీలవుతున్నారో అర్ధం కావడం లేదు. వాళ్లు మాత్రం ఏకవచనంతో బూతులు తిట్టవచ్చు. మనం మాట్లాడకూడదు అన్నట్టు ఉంది వారి పద్దతి. అసలు రెడ్డి అంటే అది ఓ కులం కాదు ఊరి పెద్ద అని అర్ధం. ఊరి బాధ్యత తీసుకునే వ్యక్తి అని అర్ధం. అలా అని నేను జగన్ రెడ్డి క్రిస్టియానిటీ తీసుకోవడాన్ని తప్పుబట్టను. ఒంగోలులో అత్యధికంగా మాదిగ వర్గీయులు ఉన్న ప్రాంతానికి వెళ్లి నేను వర్గీకరణకు వ్యతిరేకం అని జగన్ రెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్లు ఇవ్వం అన్నారు. అయినా ఓట్లు వేశారు. ఆయన అనుకున్న విషయాన్ని ఆయన బలంగా మాట్లాడినప్పుడు నేను అనుకున్న విషయాన్ని నేను ఎందుకు బలంగా మాట్లాడకూడదు' అని పవన్ కళ్యాణ్ అన్నారు. కడపలో యురేనియం తవ్వకాలపై త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటన ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

English summary
I am with you: pawan kalyan told to janasena workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X