• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమ‌ల: ఐఆర్ సీటీసీ.. పైస్ జెట్: ఒక రాత్రి, రెండు ప‌గ‌ళ్లు

|

తిరుప‌తిః ప‌వ‌త్ర పుణ్యక్షేత్రం తిరుమ‌ల‌కు వెళ్ల‌డం కాశీయాత్ర‌తో స‌మానం అంటారు పెద్ద‌లు. తిరుమ‌ల వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డం అంటే కాశీ యాత్ర చేసినంత క‌ఠినం అని దాని సారాంశం. నిజ‌మే! ఎంత అత్యాధునికత‌ను సంత‌రించుకున్నా, ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌక‌ర్యం అందుబాటులోనే ఉన్నా శ్రీవారిని ద‌ర్శించ‌డం అంత సుల‌వు కాదు.
ఆన్ లైన్ లో ద‌ర్శ‌నం టికెట్ల‌ను ముందే బుక్ చేసుకోవాలంటే.. క‌నీసం నెల రోజుల ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర్శ‌నం, గ‌దుల బుకింగ్‌, ఆర్జిత సేవా టికెట్లు, 300 రూపాయ‌ల టికెట్లను బుక్ చేసుకోవడం రాత్రికి రాత్రి కుదిరే ప‌ని కాదు.

ర‌వాణా వ్య‌వ‌స్థ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోదు. తిరుమ‌ల వైపున‌కు వెళ్లే రైళ్ల‌న్నీ ఎప్పుడో భ‌ర్తీ అయిపోయి ఉంటాయి. ఏ రైలులో వెదికినా వెయిటింగ్ లిస్ట్ క‌నిపిస్తుంది. అప్ప‌టిక‌ప్పుడు విమానం ద్వారా వెళ్లి, రావాల‌న్నా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హార‌మే. వాట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే.. పెద్ద‌లు చెప్పిన మాట నిజ‌మే అనిపిస్తుంది. వరుస‌గా సెల‌వులు ఉన్న రోజుల్లో ప‌ర్యాట‌క శాఖ ప్యాకేజీ టూర్ల‌ను ప్ర‌క‌టిస్తుంటుంది. వాటి ద్వారా వెళ్ల‌గ‌లిగితే కొంత న‌యం.

irctc collabarate with spice jet for package tour to tirupati

తాజాగా- ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఓ కొత్త ప్యాకేజీని ప్ర‌క‌టించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీవారి భ‌క్తులకు ఇది అనువుగా ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను అతి తక్కువ సమయంలో శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగించ‌డానికి ఉద్దేశించిన ప్యాకేజీ అది. ఐఆర్‌సీటీసీ అధికారులు ఇటీవ‌లే స్పైస్ జెట్ విమాన‌యాన సంస్థ‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది ఖ‌ర్చుతో కూడుకున్న‌దే అయిన‌ప్ప‌టికీ.. శ్రీవారి సుల‌భ ద‌ర్శ‌నం గ్యారంటీ. నివాస వ‌స‌తికి ఢోకా ఉండ‌దు.

ఐఆర్ సీటీసీ ప్యాకేజీ ద్వారా తిరుమ‌లకు వెళ్లి రాద‌ల‌చుకున్న భ‌క్తుల‌కు స్పైస్ జెట్ విమానంలో టికెట్ బుక్ చేస్తారు. భ‌క్తుల‌ను తిరుమ‌ల‌లో నివాస వ‌స‌తి క‌ల్పిస్తారు. శ్రీఘ్ర దర్శనం ద్వారా స్వామి వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. రెండు రోజులు, ఒక రాత్రితో కూడిన ప్యాకేజీ ఇది. తిరుమ‌ల‌లో ఏసీ గ‌దుల్లో బ‌స ఏర్పాటు చేస్తారు. ఒక పూట టిఫిన్‌, రెండు పూటల భోజనాలు, ఏసీ బస్సుల్లో నగర సందర్శన, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటాయి.

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర పెద్దలు (ఒక్కరికి) 11,968 రూపాయ‌లు, ఇద్దరు ఉంటే 10,774 ఒక్కొక్క‌రి నుంచి వ‌సూలు చేస్తారు. అదే ముగ్గురు ఉంటే 10,517 రూపాయ‌ల‌ను చెల్లించాల్సి ఉంటుంది. 2 నుంచి 11 ఏళ్ల వ‌ర‌కు వ‌య‌స్సున్న పిల్ల‌ల‌కు ఒక్కొక్క‌రికి 10,000 ఛార్జీని భ‌క్తుల నుంచి వ‌సూలు చేస్తారు. వ‌చ్చే నెల 1, 8, 15, 22, 29 తేదీల్లో శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి స్పైస్ జెట్ విమానం తిరుప‌తికి బ‌య‌లుదేరుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుప‌తి లోకల్ టూర్ కూడా ఉంటుంది. కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం. శ్రీకాళహస్తి. శ్రీనివాసమంగాపురం. శ్రీవారి శ్రీఘ్రదర్శనం. తిరుచానూరు పద్మావతి ఆల‌యాల‌ను సంద‌ర్శించుకోవ‌చ్చు.

English summary
Indian Railways catering and tourism collabarate with spice jet for organized ttd tour package for devotees of Lord Balaji, Air conditioned rooms for acomadation food, tiffin, local tour also included in this package says IRCTC. Devotees can get Seeghra Darshanam of Sree Vaaru with hastle free.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X