తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుప‌తిలో జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం : అక్క‌డే ఎందుకు : ఒకేసారి మంత్రుల‌తో స‌హా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయం కావ‌టంతో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 30వ తేదీన జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి నిర్ణ‌యించారు. తొలుత గ‌తంలో పార్టీ ప్లీన‌రీ జ‌రిగిన ప్రాంతంలోనే ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని భావించినా..ప్ర‌త్యేక కార‌ణాల‌తో తిరుప‌తిలో ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో మొత్తం మంత్రివ‌ర్గం అదే రోజు ప్ర‌మాణ స్వీకారం చేసే విధంగా ప్రణాళిక‌లు సిద్దం అవుతున్నాయి.

30న తిరుప‌తిలో ప్ర‌మాణ స్వీకారం

30న తిరుప‌తిలో ప్ర‌మాణ స్వీకారం

ఏపి ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితాల సాధిస్తూ విజ‌యం ఖాయం చేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ప్ర‌మాణ స్వీకారం తొలుత గ‌తంలో పార్టీ ప్లీన‌రీ జ‌రిగిన ప్ర‌దేశం లోనే ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని భావించారు. అయితే, కొంత కాలంగా జ‌గ‌న్ విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స్వామిజీ చెప్పిన విధంగా ముందుకు వెళ్తున్నారు. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు తొలుత 26వ తేదీన ప్ర‌మాణ స్వీకారానికి నిర్ణ‌యించుకొని..ఆ త‌రువాత ఈనెల 30వ తేదీకి మార్చ‌కున్నారు. అదే విధంగా ఆయ‌న సూచ‌న‌ల మేర‌కే ప్ర‌మాణ స్వీకార‌న్ని వేదిక‌ను తిరుప‌తికి మార్చారు. అదే రోజు ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకొని ఆ త‌రువాత తిరుప‌తిలోని తార‌క రామా స్టేడియంలో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఖ‌రారు చేసారు.

అదే రోజు క్యాబినెట్ మంత్రులూ...

అదే రోజు క్యాబినెట్ మంత్రులూ...

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలోనే మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీని కోసం ఇప్ప‌టికే జ‌గ‌న్ క‌స‌ర‌త్తు పూర్తి చేసారు. ఏ జిల్లా నుండి ఎవ‌రికి ఇవ్వాల‌నే దాని పైన జ‌గ‌న్ నిర్దిష్ట అంచ‌నాకు వ‌చ్చారు. ఎవ‌రు గెలుస్తార‌నే స‌మాచారం ముందుగానే స్ప‌ష్టంగా ఉండ‌టంతో..ప్రాంతీయ‌-సామాజిక స‌మ‌తుల‌త్య పాటిస్తూ కేబినెట్ కూర్పు చేస్తున్నారు.

హోం శాఖ మ‌హిళ‌కే

హోం శాఖ మ‌హిళ‌కే

దీని కోసం అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త‌..మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ జ‌గ‌న్ న‌త కేబినెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. వైయ‌స్ త‌ర‌హాలోనే జ‌గ‌న్ సైతం హోం శాఖ మ‌హిళ‌కే కేటాయిస్తార‌ని తెలుస్తోంది. అయితే, చంద్ర‌బాబు లాగా ఉప ముఖ్య‌మంత్రుల విధానం తెచ్చే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. దీంతో.. ఇక‌, ఆశావాహులు ఇప్పుడు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం కోసం జ‌గ‌న్‌ను ప్ర‌స‌న్నం చేసుకొనే ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌నున్నారు.

English summary
YS Jagan Decided to sworn as CM on 30th may in Tirupati. Jagan also decided to form his cabinet in total at the same time. After Balaji Darshan swearing ceremony in Taraka Rama Stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X