• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి ఉపఎన్నిక: పవన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం

|

ఆంధ్రప్రదేశ్ లో తమ రాజకీయ భవిష్యత్తు దశను నిర్ధారించబోయేది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికనే అని జనసేన పార్టీ సభ్యులు భావిస్తున్నారని, అందుకే తిరుపతిలో పోటీని తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. హిదూత్వకు ప్రతినిధినని చెప్పుకునే బీజేపీ.. తిరుపతిలో ప్రచారాన్ని ఉధృతం చేసిన తరుణంలో.. శ్రీవేంకటేశ్వరుడి సాక్షిగా పవన్ రామబాణాన్ని వదిలారు. అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించబోయే భవ్యమందిరానికి భారీ విరాళం ప్రకటించారు. అంతేకాదు, శ్రీరాముడిపై ఆసక్తికర వ్యాఖ్యలతో ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారిలా..

  Pawan Kalyan Visits Tirumala Temple, Announced Rs 30 lakh Donation for Ayodhya Rama Mandir

  జగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు-టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనంజగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు-టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనం

  శ్రీవారి దర్శనం తర్వాత జైశ్రీరాం

  శ్రీవారి దర్శనం తర్వాత జైశ్రీరాం

  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కోసం పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకుగానూ రెండురోజుల పర్యటన కోసం పవన్ గురువారం సాయంత్రం తిరుపతి వచ్చారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కీలక అంశాలను చర్చించారు. పవన్ అంగీకారంతోనే తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని కాషాయనేతలు చెబుతుండగా పవన్ పర్యటన కీలకంగా మారింది. శుక్రవారం ఉదయం తిరుమల కొండపైకి వెళ్లిన పవన్.. శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రీరాముడి గొప్పతనాన్ని వివరిస్తూ, అయోధ్య మందిరానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. పవన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

  రాముడి వల్లే దేశంలోకి ఇతర మతాలు..

  రాముడి వల్లే దేశంలోకి ఇతర మతాలు..

  ‘‘రామో విగ్రహవాన్ ధర్మః.. అని భగవాన్ శ్రీరాముడి గురించి ఒక మహా పండితుడు చెప్పాడు. అంటే, ధర్మానికి ప్రతిరూపమే శ్రీరాముడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. బలంగా నిలబడగలిగిందంటే.. శ్రీరాముడు ఏర్పరిచిన మార్గమే కారణం. దేశంలో పరమత సహనం కొనసాగుతోందంటే, అన్ని మతాలకు మన దగ్గర అంగీకారం లభించిందంటే దానికి కూడా శ్రీరాముడు ఏర్పరచిన దారే కారణం. అందుకే ‘రామరాజ్యం' అనే మాట పుట్టుకొచ్చింది. కాగా..

  శశికళకు కరోనా పాజిటివ్ -24 గంటల్లో ట్విస్టులు -ఐసీయూలో చేరిక -జయలలిత చికిత్సలా?శశికళకు కరోనా పాజిటివ్ -24 గంటల్లో ట్విస్టులు -ఐసీయూలో చేరిక -జయలలిత చికిత్సలా?

  అయోధ్య మందిరానికి రూ.30 లక్షలు..

  అయోధ్య మందిరానికి రూ.30 లక్షలు..

  అన్ని మతాలు, అన్ని కులాలు, సకల ప్రాణకోటి సుఖంగా ఉండాలనేదే రామరాజ్యం. అలాంటి ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయం కడుతోంటే.. చిన్నాపెద్దా అందరూ కలిసి ప్రతి ఒక్కరూ మందిర నిర్మాణానికి విరాళం ఇవ్వాలి. నా వంతు కృషిగా రూ.30 లక్షల విరాళాన్ని రామాలయ నిర్మాణానికి ఇస్తున్నాను. అంతేకాదు..

  ఆశ్చర్యకరంగా కింద పనిచేసేవాళ్లూ..

  ఆశ్చర్యకరంగా కింద పనిచేసేవాళ్లూ..

  అయోధ్యలో నిర్మించబోయే రామమందిరానికి నేను విరాళం ఇస్తున్నానని తెలియగానే చాలా ఆశ్చర్యంగా నా కింద పనిచేస్తోన్న పార్టీ కార్యవర్గ సభ్యులు కూడా విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వాళ్లలో క్రిస్టియన్లు, ముస్లింలు, పలు కులస్తులు కూడా ఉన్నారు. వారంతా కలిసి రూ.11 వేలు మందిరానికి విరాళంగా ఇచ్చారు.

  ఈ రెండు మొత్తాలను (30 లక్షలు ప్లస్ 11వేలు) బ్యాంకు డీడీల రూపంలో మందిరానికి విరాళంగా అందిస్తున్నాం'' అని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా, పవన్ ఉదహరించిన ‘రామో విగ్రహవాన్ ధర్మః' అనే మాటను అన్నది మహా పండితుడు కాదు, దేవతలు కాదు, ఋషులు కాదు, మానవులు కూడా కాదు... రాక్షసుడైన మారీచుడు. అయితే, భక్తులు ఎలాంటివారైనా భేదాలు ఉండవన్నది వేరే విషయం.

  English summary
  Janasena chief Pawan Kalyan has announced a donation of Rs 30 lakh for the construction of the Ayodhya Rama Mandir. speaking to media on friday, pawan announced the details and said the construction of this magnificent temple is a long time dream of the people of india.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X