తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల శ్రీవారి సేవలో కేసీఆర్

|
Google Oneindia TeluguNews

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు కేసీఆర్. స్వామి వారి దర్శనం కోసం నిన్న సాయంత్రం కేసీఆర్ తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఆశీర్వాదం ..
ఉదయం శ్రీవారి ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ చైర్మన్ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, ఆలయ వేదపండితులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ మహాద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు స్వామి వారి మూల విరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

kcr offered prayers tirumala balaji

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను కేసీఆర్ దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం తర్వాత అక్కడే కాసేపు ఉండి .. మధ్యాహ్నం కేసీఆర్ బయలుదేరతారని సీఎంవో అధికారవర్గాలు తెలిపాయి.

English summary
telangana cm kcr offered prayers tirumala balaji. ttd chairman, eo welcome to kcr family. offered prayers after to give kcr prasadam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X