తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్‌డౌన్ వేళ: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ‘తీపి’ కబురు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రముఖ ఆలయాల దర్శనాలు అనుమతించని విషయం తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ మే 31 వరకు విధించడంతో రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.

ఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహంఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహం

భక్తుల దర్శనాలపై చెప్పలేం..

భక్తుల దర్శనాలపై చెప్పలేం..

ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనాన్ని కల్పించకపోవడం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. భక్తులకు దర్శనాలు ఎప్పుడు పునర్ ప్రారంభిస్తామనేది ఇప్పట్లో చెప్పలేమని తెలిపారు.

22 నుంచి లడ్డు ప్రసాదాలు

22 నుంచి లడ్డు ప్రసాదాలు


భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ఒకటి రూ. 25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మే 22 నుంచి టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు జరుపుతామని తెలిపారు. పెద్ద మొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ -98495 75952, ఆలయ పేష్కార్ శ్రీనివాస్ -9701092777 నెంబర్లను సంప్రదించవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి పాదాలకు బస్సులు

శ్రీవారి పాదాలకు బస్సులు


ఇది ఇలావుండగా, తిరుమలలోని పాపవినాశంతోపాటు శ్రీవారి పాదాలకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల డిపో మేనేజర్ గిరిధర్ తెలిపారు. భక్తులకు తక్కువ టికెట్ ధరతో శ్రీవారి పాదాలకు చేర్చాలని నిర్ణయించామని తెలిపారు. తిరుమలకు సరుకు రవాణా కోసం బస్సులను నడుపుతామని చెప్పారు.

English summary
Laddu sale to begin in TTD Kalyanamandapams from May 22: YV Subba Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X