తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019 : తిరుపతి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : Tirupathi Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

ఆంధ్రప్రదేశ్‌లోని కలియుగ వైకుంఠంగా పేర్కొనే తిరుపతి నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన రాజకీయ చరిత్ర ఉంది. షెడ్యూల్ కులాల రిజర్వుడు సీటైన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరప్రసాద్ వెలగపల్లి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాంపై 37,425 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరప్రసాద్‌కు 580,376 ఓట్లు పోలవ్వగా, జయరాంకు 542,951 ఓట్లు వచ్చాయి.

విద్యాధికుడైన వరప్రసాద్ 2014, మే 18న తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఆయన ఎంఎస్సీ, ఎంఏతోపాటు డాక్టరేట్‌ను కూడా అందుకొన్నారు. ఎంపీగా ఆయన పదవీ కాలం జూన్ 20, 2019లో ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన వయస్సు 65 సంవత్సరాలు.

ఐదేళ్ల పదవీకాలంలో ఇప్పటివరకు లోక్‌సభలో పలు అంశాలపై జరిగిన చర్చల్లో 76 సార్లు క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రానికి సంబంధించిన చర్చల్లో 35 శాతం, దేశానికి సంబంధించిన చర్చల్లో 58 శాతం పాల్గొన్నారు. ప్రైవేట్ బిల్లుల్లో స్వల్పంగా పాలుపంచుకొన్నారు. లోక్‌సభలో ఆయన హాజరు శాతం 82. రాష్ట్రానికి సంబంధించిన చర్చల్లో 77 శాతం మేరకు సభకు హాజరయ్యారు. తిరుపతి నియోజకవర్గానికి రూ.23.91 కోట్ల ఎంపీ లాడ్స్ మంజూరు కాగా, జిల్లా అధికారులు రూ.14.53 కోట్లు అభివృద్ది పనులకు ఖర్చు చేశారు.

#LokSabhaElection2019: All about tirupati Constituency

2014 గణాంకాల ప్రకారం తిరుపతి లోక్‌సభ పరిధిలో 1,574,544 మంది ఓటర్లు నమోదుయ్యారు. అందులో 778,778 పురుషులు కాగా, 795,766 మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 1,213,064 ఓటర్లు హక్కును వినియోగించుకొన్నారు. ఇందులో 604,834 మంది పురుషులు, 608,230 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. గత ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదైంది.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం జనాభా 2,154,860. ఇందులో 67 శాతానికి పైగా గ్రామీణ ప్రజలు, 33 శాతానికి పైగా పట్టణ ప్రజలు ఉన్నారు. ఈ జనాభాలో ఎస్సీ 25 శాతం, ఎస్టీలు 10 శాతం మేర ఉన్నారు.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సర్వేపల్లి, గూడురు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీ కాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1952 నుంచి 1984 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంత సాయనం అయ్యంగార్, సీ దాస్, టీ బాలకృష్ణ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 1984 నుంచి 96 వరకు కాంగ్రెస్ తరఫున చింతా మోహన్, 1996 నుంచి 98 వరకు ఎన్ సుబ్రమణ్యం, 1998 నుంచి 1999 వరకు చింతామోహన్ ఎంపీగా సేవలందించారు. 1999 నుంచి 2004 వరకు ఎన్ వెంకటస్వామి బీజేపీ తరపున ఎంపీగా కొనసాగారు. 2004 నుంచి 2014 వరకు మళ్లీ చింతా మోహన్ ఎంపీగా కొనసాగారు. ప్రస్తుతం 2014 నుంచి వీ వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు.

2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చింతా మోహన్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వెంకటస్వామిపై 199,328 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. చింతామోహన్‌కు 510,961 ఓట్లు రాగా, డాక్టర్ ఎన్ వెంకటస్వామికి 311,633 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 850,787 ఓట్లు నమోదయ్యాయి.

2009లో కాంగ్రెస్ అభ్యర్తిగా చింతామోహన్ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై 19,276 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చింతామోహన్‌కు 428,403 ఓట్లు రాగా, వర్ల రామయ్యకు 409,127 ఓట్లు, పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వరప్రసాద్‌కు 171,638 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో 1,061,533 ఓట్లు నమోదయ్యాయి.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on tirupati Lok Sabha Constituency of Andhra Pradesh. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X