• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోజా అసంతృప్తి: వైఎస్ జగన్‌ దృష్టికి ఆ ఇష్యూ: న్యాయం చేయాలంటూ

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. తుది నోటిఫికేషన్‌పై కసరత్తు వేగవంతమైంది. జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు అందిన విజ్ఞప్తులన్నింటినీ ప్రభుత్వం తెప్పించుకుంటోంది. తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి ఉద్దేశించిన గడువు సమీపిస్తోండటంతో- దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని ప్రాంతాల ప్రజల డిమాండ్లు, మనోభావాలను గౌరవిస్తూ తుది నోటిఫికేషన్‌లో పొందుపరచడం ఖాయంగా కనిపిస్తోంది.

 ఏప్రిల్ 2 నుంచి..

ఏప్రిల్ 2 నుంచి..


రాష్ట్రంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ..భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నింటికీ సమదూరంలో జిల్లా కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.

మార్పులు చేర్పులతో తుది నోటిఫికేషన్..

మార్పులు చేర్పులతో తుది నోటిఫికేషన్..

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రస్తుతం ప్రజాభిప్రాయాలను సేకరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని- ఇదివరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మళ్లీ మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను గుర్తిస్తూ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మార్పులు చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి భారీగా అందుతున్నాయి.

 నగరిని శ్రీబాలాజీ జిల్లాలో విలీనం..

నగరిని శ్రీబాలాజీ జిల్లాలో విలీనం..

చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి నియోజకవర్గాన్ని- తిరుపతి కేంద్రంగా కొత్తగా ఏర్పడబోయే శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్ ఉధృతంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గాలి భానుప్రకాష్ రెడ్డి ఆందోళనలు సైతం నిర్వహించారు. నగరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే కొనసాగింపజేయడాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తోన్నారు. శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

రోజాది కూడా అదే మాట..

రోజాది కూడా అదే మాట..

ఇప్పుడు రోజా కూడా అదే డిమాండ్ చేస్తోన్నారు. నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో విలీనం చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని అన్నారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. నగరి నియోజకవర్గ ప్రజలకు తిరుపతికి రాకపోకలు సాగించడం సులువుగా ఉంటుందని, చిత్తూరులోనే కొనసాగించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు.

కలెక్టర్‌కు వివరిస్తా..

కలెక్టర్‌కు వివరిస్తా..

ఈ విషయంపై తాను త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేస్తానని రోజా తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తన వాదనలను వినిపిస్తానని చెప్పారు. నగరి నియోజకవర్గ ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి గౌరవిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. తిరుపతితో తన నియోజకవర్గ ప్రజలకు అనుబంధం ఎక్కవ అని, నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని గుర్తు చేశారు. చిత్తూరుకు వెళ్లాలంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.

బాలాజీ జిల్లా స్వరూపం ఇదే..

బాలాజీ జిల్లా స్వరూపం ఇదే..


తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకుని శ్రీబాలాజీ జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరిని దీని పరిధిలోకి చేర్చింది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలతో చిత్తూరు జిల్లా కొనసాగుతుంది. ఒక్క కార్వేటి నగరం మినహా.. నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీ పురం, ఏర్పేడు, రేణిగుంట..తిరుపతి పరిధిలోకి వచ్చే మండలాలు.

English summary
YSRCP MLA RK Roja said that she has requested CM YS Jagan to merge Nagari in Proposed Balaji district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X