తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీకి సిగ్గుందా: జ‌వాన్లు మ‌ర‌ణిస్తే ప్ర‌ధాని ఎక్క‌డ‌ ఉన్నారు :రాహుల్ ధ్వ‌జం..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విరుచుకుప‌డ్డారు. పుల్వామా లో ఉగ్ర‌దాడి లో సైనికులు మ‌ర‌ణిస్తే.. ప్ర‌ధాని మోదీ షూటింగ్ ల‌కు ఫోజులు ఇవ్వ‌టానికే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని రాహుల్ ఆరోపించారు. సైనికుల కుటుంబాల ను పరామ‌ర్శించాల‌నే ఆలోచ‌న కూడా ప్ర‌ధానికి రాలేద‌న్నారు.

జ‌వాన్లు మ‌ర‌ణిస్తే సినిమాలు ముఖ్య‌మా...
పుల్వామా లో మ‌న సైనికుల పై ఉగ్ర‌వాదులు దాడి చేసి..సైనికుల‌ను హ‌త‌మారిస్తే మూడున్నార గంట‌ల పాటు ప్ర‌ధాని మోదీ సినిమాల్లో ఫోజులు ఇస్తూ స‌మ‌యం గ‌డిపార‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సైనికుల పై దాడి జ‌రిగింద‌ని..పెద్ద సంఖ్య‌లో సైనికులు మ‌ర‌ణించార‌ని స‌మాచారం అందినా..న‌వ్వుతూ కెమేరాల ముందు నిల బ‌డ్డార‌ని అస‌లు మోదీకి మాన‌వత్వం ఉందా అని రాహుల్ ప్ర‌శ్నించారు. అంత పెద్ద మొత్తంలో సైనికులు మ‌ర‌ణిస్తే క‌నీసం వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి వారికి అండ‌గా నిల‌వాల‌నే ఆలోచ‌న కూడా ప్ర‌ధాని గా వ్య‌క్తిగా రాలేద‌న్నారు.
అస‌లు ఈ ప్ర‌ధానికి సిగ్గుండా అని రాహుల్ నిల‌దీసారు. సైనికుల పై దాడి జ‌రిగితే ప్ర‌ధాని గా ఉన్న వ్య‌క్తి మూడున్నార గంట‌ల వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌టం దారుణం అని రాహుల్ విమ‌ర్శించారు.

Modi has no shame : Rahul fire on Prime minister

చౌకీదార్ కాదు..మోదీ చోర్‌..
మోదీ ఇప్పటి వరకు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. రాఫెల్‌ విషయంలో అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని, కాపలాదారుడే దొంగ అని ప్రజలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సత్యాలే చెబుతుందని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని, తమ హయాంలో రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. మోదీ పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేశారని, రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో రెండ్రోజుల్లో రుణమాఫీ చేశామని, కాంగ్రెస్‌ మాట మీద నిలబడే పార్టీ అని మరోసారి రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. రైతుల‌కు ఏం చేయ‌లేని ప్ర‌ధాని..పారిశ్రామిక వేత్త‌ల‌కు మూడున్నార ల‌క్ష‌ల రుణ మాఫీ చేసార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

English summary
AICC chief Rahul Gandhi serious comments on Prime minister Modi. When Pulwama incident Happen Modi not reponded upto three and half hours. Up to that time he enjoyed with cinema. Rahul says Modi does not have humanity to console martyr families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X