తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకాంతంగా.. ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు.. ముంబై, వారణాసిలో ఆలయాలు, టీటీడీ నిర్ణయాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావంతో ఏ ఉత్సవం లేదు, వేడుక లేదు. వినాయక చవితి కూడా అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే నిర్వహించబోతున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం శుక్రవారం జరిగింది. దీంతోపాటు పలు నిర్ణయాలను మండలి తీసుకుంది.

ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు

ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు

వచ్చేనెల 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కానీ ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సారి అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. సెప్టెంబర్‌లో ఏకాంతంగా నిర్వహిస్తామని.. అక్టోబర్‌లో దసరా ముందు అప్పటి పరిస్థితిని బట్టి‌ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు ఆలయాలు నిర్మించేందుకు పాలకమండలి నిర్ణయం తీసుకున్నది.

ముంబై, కశ్మీర్, వారణాసిలో ఆలయాలు

ముంబై, కశ్మీర్, వారణాసిలో ఆలయాలు

దేశ వాణిజ్య రాజధాని బాంబేలో ఆలయం నిర్మిస్తామని పేర్కొన్నారు. వారణాసిలో కూడా ఆలయ నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వాన్ని స్దలం కేటాయించాలని కోరామని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో ‌కూడా ఆలయ నిర్మాణం చేపడుతామని వివరించారు. టీటీడీలో ఆదాయం పెంచేందుకు ఫిక్స‌డ్ డిపాజిట్లపై కార్పస్ ఫండ్స్ కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో చిన్న‌ పిల్లల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించారు.

విశాఖలోనూ శ్రీవారి ఆలయం

విశాఖలోనూ శ్రీవారి ఆలయం

విశాఖలో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని వెల్లడించారు. 4.95 కోట్లతో విశాఖలో శ్రీవారి ఆలయ ఘాట్ రోడ్ల నిర్మాణం చేపడుతామని వివరించారు. టీటీడీ ఉద్యోగులకు కూడా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.

ప్రతీ ఆలయం వద్ద గో మాత

ప్రతీ ఆలయం వద్ద గో మాత


సుధానారాయణ మూర్తి కోటి రూపాయలు డినేషన్ ఇస్తామని ప్రకటించారని తెలిపారు. కంపోస్టు ఎరువును ఉచితంగా రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. గో సంరక్షణపై పాలక మండలిలో చర్చించామని.. ప్రతి ఆలయం వద్ద ఓ గోమాత ఉంచాలని నిర్ణయించామని వివిరించారు. గోల్డ్, క్యాష్ డిపాజిట్లకు సంబంధించి అధిక వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. డిపాజిట్‌పై నెల నెల వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Recommended Video

హిందూపూర్ ప్రజలకి Nandamuri Balakrishna భరోసా.. 55 లక్షల విరాళం!! | Oneindia Telugu
శనివారం నుంచి 3 వేల ఉచిత దర్శన టోకెన్స్

శనివారం నుంచి 3 వేల ఉచిత దర్శన టోకెన్స్

తిరుపతిలో శనివారం నుంచి మూడు వేల ఉచిత దర్శన టోకెన్స్ జారీని తిరిగి‌ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. త్వరలో ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. స్వామివారికి ఇప్పటికీ పాత నోట్లు వస్తుండటంపై కూడా సమావేశంలో చర్చించారు. నోట్ల మార్పిడి చేయడంపై ఆర్బీఐతో చర్చించాలని నిర్ణయించారు. తిరుమలలో తాగునీటి సరఫరా కోసం రూ. 10 కోట్లను కేటాయించామని తెలిపారు.

English summary
ttd makes key decisions: mumbai, varanasi to construct temples ttd chairman yv subba reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X