• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రక్తచరిత్ర ఎవరిదో అందరికీ తెలుసు జగన్ రెడ్డి , కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు :అలిపిరిలో లోకేష్

|

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తనకు తన కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అలిపిరి చెక్ పోస్ట్ వద్ద బైఠాయించారు.

వివేకా హత్య పై వైసిపి నేతలు పూటకో మాట చెప్పారని, నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగ వార్తలు రాశారని మండిపడిన లోకేష్ రక్త చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు.

మందు పాతరలకే భయపడలేదు, గులకరాళ్ళకు జంకుతానా ? వైసీపీని ప్రశ్నించిన చంద్రబాబు

 అలిపిరి లో ఉన్నా .. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ రాగలరా?

అలిపిరి లో ఉన్నా .. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ రాగలరా?

తనకు తన కుటుంబ సభ్యులకు వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో ఎలాంటి పాత్ర లేదని ఆ వెంకటేశ్వరస్వామి ప్రమాణం చేస్తానని ఏప్రిల్ 7వ తేదీన సూళ్లూరుపేటలో సవాలు చేసిన లోకేష్, ఇక ఈరోజు అలిపిరి వద్దకు చేరుకుని నేను అలిపిరి లో ఉన్నా .. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ రాగలరా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్ ను అలిపిరి కి తీసుకురావాలని లోకేష్ అన్నారు. బాబాయ్ ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్ కు లేదా అంటూ ప్రశ్నించారు.

 కత్తితో బతికే వాడు కత్తితోనే చస్తాడు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి

కత్తితో బతికే వాడు కత్తితోనే చస్తాడు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి

ఇక తమ కుటుంబానికి రక్త చరిత్ర లేదని కత్తితో బతికే వాడు కత్తితోనే చస్తాడు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు లోకేష్ . ఇక సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై ప్రస్తావించిన లోకేష్ హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నించారు . ఈరోజు తేలిపోతుంది నేను రెడీ.. నువ్వు ఎక్కడ అంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా వివేక గారి హత్యతో నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చెయ్యి రాకపోతే వివేకానంద గారిని వేసేసింది అబ్బాయే అనే విషయం ప్రపంచానికి అర్థమవుతుంది అంటూ లోకేష్ పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ , ఏ2 విజయసాయి రెడ్డి చిన్న దొంగ

జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ , ఏ2 విజయసాయి రెడ్డి చిన్న దొంగ

ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ , ఏ2 విజయసాయి రెడ్డి చిన్న దొంగ అని పేర్కొన్న లోకేష్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు అని నాడు విజయసాయిరెడ్డి చెప్పారు. వివేకా హత్య జరిగిన నాడు దాదాపు మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే ఎవిడెన్స్ లేకుండా ఆ రోజే చెరిపేశారు . ఆ సమయంలో గంగిరెడ్డి , వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు అందరూ మధ్యాహ్నం తర్వాత మాట మార్చి లోకేష్ , చంద్రబాబు హస్తం ఉందని సీన్ క్రియేట్ చేశారు.

 అలిపిరిలో నారా లోకేష్ ... జగన్ పైనే మాటల గురి

అలిపిరిలో నారా లోకేష్ ... జగన్ పైనే మాటల గురి

అప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు సిబిఐ విచారణపై దూరంగా జరిగారు అంటూ లోకేష్ వివేకా హత్య కేసు పై నేడు అలిపిరి వేదికగా జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

అందుకే తనకు , తన కుటుంబానికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని వెంకన్న మీద ప్రమాణం చేస్తానని సవాల్ విసిరి అలిపిరి వెళ్లి అక్కడ నుండి జగన్ ను టార్గెట్ చేశారు .

English summary
Telugu Desam Party national general Secretary Nara Lokesh reached Alipiri and said that his family is not having an association with the murder of YS Vivekananda Reddy. He came to the Alipiri circle to make a promise that there was no link for his family members in the YS Viveka murder case. He lashed out at YSRCP leaders for changing statements frequently and he expressed anger for carrying an article in a new paper targetting the Nara family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X