తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోగికి "ఓ" పాజిటీవ్ రక్తానికి బదులు "బీ" పాజిటీవ్‌ను ఎక్కించిన ఆసుపత్రి వైద్యులు

|
Google Oneindia TeluguNews

వేలుకు బదులు కాలును, పంటికి బదులు కంటికి వైద్యులు చికిత్స అందిస్తారనే నానుడి కొద్దిమంది వైద్యుల నిర్లక్ష్యంతో ఇంకా ప్రజల్లో నానుతూనే ఉంది. వైద్య చికిత్సలో ఎంతో అధునాతన పరిజ్ఝానం వస్తున్నా.. వాటిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారనే అపవాదు నుండి కొంతమంది వైద్యులు బయటపడలేక పోతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యులు క్లిష్టతరమైన సమస్యతలో వస్తున్న రోగులకు చికిత్స అందించి మంచి పేరు తెచ్చుకుంటుంటే తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అక్కడక్కడ కొందిమంది డాక్టర్లు తమ వైద్యవృత్తికి కళంకం తెస్తున్న సంఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలనే తిరుపతిలోని టీటీడీ నిధులతో కొనసాగుతున్న బర్డ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగు చూసింది. వారి నిర్లక్ష్యంతో ఓ రోడి కిడ్ని భాదితుడుగా మారినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో వైద్య చికిత్స వెళ్లిన రోగికి ఓ పాజిటీవ్ రక్తం బదులు బీ పాజీటీవ్ రక్తాన్ని ఎక్కించినట్టు బాధితుడు ఆరోపణలు చేశాడు. దీంతో రోగి ఆరోగ్యం మరింత క్షిణించడంతో పాటు కిడ్నీలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే తమ తప్పును తెలుసుకున్న వైద్యులు బాధితుడికి స్విమ్స్‌లో డయాలసిస్ చేయించి ఇంటికి పంపించినట్టు సమచారం.

Neglect of doctors has come to light of TTD-Bird Hospital

అయితే చికిత్స తీసుకున్న బాధితుడు అసుపత్రిపై పోరాటానికి సిద్దమయ్యాడు. దీంతో తన వైద్య చికిత్స వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వార అధికారిక సమచారాన్ని కోరాడు. అయితే బాధితుడు అడిగిన వివరాలు ఇవ్వలేని ఆసుపత్రి వైద్యులు, తమ ఆసుపత్రి ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఆసుపత్రిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

English summary
వేలుకు బదులు కాలును, పంటికి బదులు కంటికి వైద్యులు చికిత్స అందిస్తారనే నానుడి కొద్దిమంది వైద్యుల నిర్లక్ష్యంతో ఇంకా ప్రజల్లో నానుతూనే ఉంది. వైద్య చికిత్సలో ఎంతో అధునాతన పరిజ్ఝానం వస్తున్నా.. వాటిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారనే అపవాదు నుండి కొంతమంది వైద్యులు బయటపడలేక పోతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యులు క్లిష్టతరమైన సమస్యతలో వస్తున్న రోగులకు చికిత్స అందించి మంచి పేరు తెచ్చుకుంటుంటే తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అక్కడక్కడ కొందిమంది డాక్టర్లు తమ వైద్యవృత్తికి కళంకం తెస్తున్న సంఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలనే తిరుపతిలోని టీటీడీ నిధులతో కొనసాగుతున్న బర్డ్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగు చూసింది. వారి నిర్లక్ష్యంతో ఓ రోడి కిడ్ని భాదితుడుగా మారినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో వైద్య చికిత్స వెళ్లిన రోగికి ఓ పాజిటీవ్ రక్తం బదులు బీ పాజీటీవ్ రక్తాన్ని ఎక్కించినట్టు బాధితుడు ఆరోపణలు చేశాడు. దీంతో రోగి ఆరోగ్యం మరింత క్షిణించడంతో పాటు కిడ్నీలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే తమ తప్పును తెలుసుకున్న వైద్యులు బాధితుడికి స్విమ్స్‌లో డయాలసిస్ చేయించి ఇంటికి పంపించినట్టు సమచారం. అయితే చికిత్స తీసుకున్న బాధితుడు అసుపత్రిపై పోరాటానికి సిద్దమయ్యాడు. దీంతో తన వైద్య చికిత్స వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వార అధికారిక సమచారాన్ని కోరాడు. అయితే బాధితుడు అడిగిన వివరాలు ఇవ్వలేని ఆసుపత్రి వైద్యులు, తమ ఆసుపత్రి ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఆసుపత్రిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X