తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి నో పర్మిషన్ .. పలువురు నేతల హౌస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తుంది టీడీపీ. ఇక రాజధాని అమరావతి పోరాట ప్రకంపనలు రాష్ట్రం అంతా తెలిసేలా ఆందోళనలు ఉధృతం చేసింది టీడీపీ . రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులకు మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు టీడీపీ నేతలు. ఇక చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ర్యాలీలకు పోలీసుల ఆంక్షలు .. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం .. ఇంటి ముందే చింతమనేని నిరసనర్యాలీలకు పోలీసుల ఆంక్షలు .. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం .. ఇంటి ముందే చింతమనేని నిరసన

తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతివ్వని పోలీసులు

తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతివ్వని పోలీసులు

మొన్న మచిలీపట్నంలో, నిన్న రాజమండ్రిలో ర్యాలీలు చేసి జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు పర్యటన నేడు తిరుపతిలో కొనసాగనుంది. అయితే తిరుపతిలో ఆయన ర్యాలీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఇవాళ తిరుపతిలో ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే పండుగ సీజన్ కావడంతో అనుమతిని నిరాకరిస్తున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు. దీంతో తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది .

 చిత్తూరు జిల్లా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

చిత్తూరు జిల్లా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

మరోవైపు, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని. తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీకి అనుమతి లేని కారణంగా ర్యాలీ నిర్వహించకూడదని, ఎవరూ ఈ ర్యాలీలో పాల్గొనకూడదు అని పోలీసులు తెలిపారు.

తిరుపతి లో బాబు ర్యాలీ, సభపై కొనసాగుతున్న ఉత్కంఠ

తిరుపతి లో బాబు ర్యాలీ, సభపై కొనసాగుతున్న ఉత్కంఠ


ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే, చంద్రబాబు ఈ మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయల్దేరి 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని పూలే విగ్రహం వద్దకు చేరుకోవాలి . అక్కడి నుంచి నాలుగు కాళ్ల మంటపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది . సాయంత్రం 5 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించాల్సివుంది. అయితే పోలీసుల అనుమతి నిరాకరణ నేపధ్యంలో తిరుపతిలో ఎక్కడికక్కడ ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి.

English summary
Chandrababu's tour will continue today in Tirupati. However, the police refused to allow his rally in Tirupati. TDP chief Chandrababu will participate in a rally organized by the all party JAC Tirupathi to maintain Amaravati as the capital of AP. However, Tirupati Urban SP said that it is refusing permission as it is the festive season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X