తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రెడ్డి! మతం మారినాక కులం ఎందుకు?: ‘ధర్మం’పై పవన్ కళ్యాణ్, బీజేపీవాళ్లు కాదంటూ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

తిరుపతి: రాయలసీమలోనే అత్యధికంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎవరూ మాట్లాడరని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, తాను తెగించి మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లాడతానని అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలునా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు అభివృద్ధినే చూశారు..

చంద్రబాబు అభివృద్ధినే చూశారు..

ఎవరైనా రాజ్యంగ పరిధిలోనే మాట్లాడాలని అన్నారు. సింగపూర్‌లో 25శాతం వరకు చైనీయులు, ఇతర దేశాల 15శాతం వరకు ఉంటారని.. సిక్కులు, పంజాబీల గురించి ఓ యువకుడు గోడలపై తప్పుగా రాస్తే.. అతడ్ని బెత్తాలతో దెబ్బలు కొట్టారని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఇంకొకరి మనోభావాలను గౌరవించాలనే ఆలోచనతో ఇలా చేస్తారని చెప్పారు. లీ క్వాన్ చేసిన అభివృద్ధి కంటే ముందు ఆయన చట్టాలను సక్రమంగా అమలు చేసిన తీరును చూడాలని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు మాత్రం ఆయన చేసిన అభివృద్ధినే చూశారన్నారు.

నాది హిందూ మతం..

నాది హిందూ మతం..

తనది హిందూ మతమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన మతం అన్ని మతాలను గౌరవించాలని చెబుతుందని అన్నారు. ముక్కోటి దేవతలను ఇచ్చిన ధర్మంలోకి.. ఇంకో దేవుడు వచ్చినా ఇబ్బంది లేదని ఆయన అన్నారు. గల్ఫ్ దేశంలో కూడా హిందూస్థాన్ గురించి మంచిగా మాట్లాడుకుంటారని, అది మనదేశ ధర్మం గొప్పతనమిన అన్నారు.

హిందూ నాయకుల వల్లే గొడవలు.. క్లారిటీ

హిందూ నాయకుల వల్లే గొడవలు.. క్లారిటీ

మన దేశంలోని కొందరు హిందూ నాయకులే గొడవలు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. హిందూ నాయకులు అంటే బీజేపీ అనుకునేరు వాళ్లు కాదు అని పవన్ కళ్యాణ్ స్పస్టతనిచ్చారు. అన్ని పార్టీలలో ఉండే నాయకులు కావొచ్చు.. మిగితా వాళ్లు కావొచ్చని అన్నారు. సెక్యూలరిజం కొందరు హిందువల్లే ఇబ్బంది పడుతోందని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా తిడితే తాను సమాధానం చెప్పేందుకు సిద్ధమని అన్నారు. .

అది మతం కాదు..

అది మతం కాదు..

తాను ఓట్ల కోసం కౌగిలించుకోనని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని కులాలను, మతాలను సమానంగా చూడాలని.. తాను ధర్మానికి నిలబడే వ్యక్తిని అన్నారు. ఎదుటి మతాలవారిని నరికేసెయ్ అనేది మతం కాదని.. ఎదుటివారిని రక్షించేదే ధర్మమనని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఏ కులమైనా అది హిందూ ధర్మంలోనిదే..

ఏ కులమైనా అది హిందూ ధర్మంలోనిదే..


వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కులం.. మతం లేదని మానవత్వమే ఉందని అంటున్నారని.. మతం మార్చుకుంటే కులం రాకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే తాను మాత్రం మాట తప్పని కులం పుట్టానని జగన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏ కులాలైనా హిందూ ధర్మం నుంచి వచ్చినవేనని అన్నారు. క్రిస్టియానిటీకి వెళితే కులాలు రాకూడదని.. కానీ కులాలను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

మతం మారిన తర్వాత కులం ఎందుకు?

మతం మారిన తర్వాత కులం ఎందుకు?

తాను జీసస్ స్కూల్లో చదువుకున్నానని.. ఎదుటివాళ్లు చేసిన తప్పునకు కూడా జీసస్ తనకు శిక్ష వేసుకున్నాడని.. జగన్ మాత్రం ఎదుటివాళ్ల చెట్లను కూడా ఉండనివ్వడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మతం మారిన తర్వాత కులం ఎందుకు అని ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు తనకు కులం చెప్పలేదని.. నాయుడు అనేది వైసీపీవాళ్లు పెట్టారని అన్నారు. మాట తప్పని కులంలో పుట్టానని జగన్ చెప్పుకుంటున్నారని.. మతం మారిన తర్వాత కులం ఎందుకని ప్రశ్నించారు. వారికి మతం, కులం ఓట్లు కావాలని అన్నారు. వైసీపీది రంగుల రాజ్యమని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్.

English summary
Janasena Party president Pawan Kalyan hits out at ys jagan for his caste comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X