తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ దారేది? బీజేపీకి దూరం లేనన్న జనసేన నేత

|
Google Oneindia TeluguNews

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దారేటు..? ఓవైపు అధికార వైసీపీ నేతలు, ప్రభుత్వ విధానాలతో పాటు ఏకంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్ తన పాత్ర మిత్రులపై మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఇసుక సమస్య నుండి ఇంగ్లీష్ విద్యా వరకు పోరాటం చేసిన పవన్ ఒక్కసారిగా రాయలసీమ పర్యటనలో మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించారు. దీంతో తన దారి ఢిల్లీ వైపుకు అంటూ సంకేతాలను ఇచ్చారా.. అనే ఊహగానాలు ఏపీలో చక్కర్లు కొడుతున్నాయి.

పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు... ఆయన మాటలు ఎందుకు పట్టించుకోవాలి?పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు... ఆయన మాటలు ఎందుకు పట్టించుకోవాలి?

బీజేపికి తాను ఏనాడు దూరం లేను

బీజేపికి తాను ఏనాడు దూరం లేను

"బీజేపికి తాను ఏనాడు దూరం లేను , అమిత్ షా లాంటీ నాయకులు దేశానికి ఎంతో అవసరం ... సీఎం జగన్ ఇంటికి సమీపంలోని నలబై మందిని మత మార్పిడి చేశారు." ఇవి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఏపీ రాజకీయాలను కోత్త పుంతలు తొక్కిస్తుంది. పాత మిత్రులు అందరు మరోసారి ఒకే వేదిక మీదకు వస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని అధికార వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు తెరలేపారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం పవన్ చేస్తున్న వ్యాఖ్యలను స్వాగతించారు. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని తాము ఎప్పుడు కోరుకుంటామనే సంకేతాలను ఇచ్చారు.

పవన్ పవన్ వ్యాఖ్యలను స్వాగతించిన బీజేపీ

పవన్ పవన్ వ్యాఖ్యలను స్వాగతించిన బీజేపీ

ఈనేపథ్యంలోనే ఆయన అడుగులు ఢిల్లీ వైపుకు పడుతున్నాయా అనే సందేహాలు ఏపీలో చక్కర్లు కొడుతున్నాయి. తాను బీజేపీ ఏనాడు దూరం కాలేదని కేవలం ప్రత్యేక హోదా కోసమే ఒంటరిగా పోరాడానని చెప్పారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వెడెక్కాయి. ఆయన మాటలను అనుసరిస్తూనే బీజేపీ నేతలు సైతం స్వాగతాలు పలికారు. ఇలా వెంటవెంటనే పరిణామాలు జరగడంతో పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీ బాట పట్టనున్నారా అనే అనుమానాలు రేకేత్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే పవన్ వ్యాఖ్యలు చేయడం రాజకీయా వర్గాల్లో చర్చనీయంశంగా మారాయి.

ఢిల్లీ పర్యటన తర్వాత మార్పు

ఢిల్లీ పర్యటన తర్వాత మార్పు

ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మరిన్ని రాజకీయ వ్యుహాలకు పదును పెట్టారు. ఢిల్లీ పర్యటనను అంత్యంత సీక్రెట్‌గా ఉంచిన పవన్ కల్యాణ్ తిరిగి వచ్చిన అనంతరం కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. ప్రజా సమస్యల నుండి హిందుత్వ ఎజెండాకు మారారు. గతంలో బీజేపీ అనేది పాచిపోయిన లడ్డు అంటూ విమర్శించిన ఆయన ఇప్పుడు మళ్లి పాత మిత్రుల గురించి సానుకూల వ్యాఖ్యలు చేయడం వెనక ఎం జరిగి ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

రాయలసీమ పర్యటనలో దూకుడు పెంచిన పవన్

రాయలసీమ పర్యటనలో దూకుడు పెంచిన పవన్

ఈ నేపపథ్యంలోనే ఆరు రోజుల పాటు రాయలసీమలోపవన్ కల్యాణ్ పర్యటన చేస్తున్నారు. వైసీపీకి అంత్యంత పట్టుగా మారిన ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగిస్తూ... ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో పర్యటిస్తున్న పవన్ మరోసారి బీజేపీ ప్రస్తావన తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడుతూనే... కేంద్రంలో అమిత్ షా తీరును మెచ్చుకున్నారు. అనంతరం తాను బీజేపీకి ఏనాడు దూరం లేనంటూ వ్యాఖ్యానించారు. . దీంతో ఆయన చేసినఆ వ్యాఖ్యలు తనకు బీజేపీతో ఉన్న సంబంధం చెప్పకనే చెబుతున్నాయి. మరోసారి ఆయన రాజకీయ భవిష్యత్‌ను బీజేపీలో వెతుకుంటున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. మరి పవన్ కల్యాణ్ విలీనం అంశంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

English summary
Janasena chief PawanKalyan's comments on BJP have become a hot topic in AP. pawankalyan comments welcomed by bjp for merger the party into bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X