తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్రమోడీ

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన శ్రీలంక నుండి నేరుగా రేణిగుంట చేరుకున్నారు. అనంతరం తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ప్రజా ధన్యవాద సభలో పాల్గోన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న మోడీ శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా మోడీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మోడి టీటీడీ సంప్రాదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మోడీ, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో శ్రీవారిని దర్శించిన అనంతరం.. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి హుండీలో ప్రధాని మోదీ కానుకలు సమర్పించారు.అనంతరం రంగనాయకుల మండపంలో మోడీ, టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి శేషవస్త్రాన్ని ప్రధాని మోడీకి టీటీడీ అర్చకులు అందజేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. శ్రీవారి చిత్రపటాన్ని మోదీకి కానుకగా ఇచ్చారు.

pm narendra modi visited thirumala

కాగా అంతకు ముందు ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈనేపథ్యంలోనే రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మోడీకి జగన్ పుష్పగుచ్చం అందించారు. కాగా జగన్ తోపాటు ఏపీ నర్సింహన్, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. కాగా గతంలో అక్టోబర్ 2015, జనవరి 2017 లో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు ప్రధాని. శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉమ్మడి రాష్ట్ర్రాల గవర్నర్ నర్సింహన్, సీఎం జగన్‌తోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు ఉన్నారు.

English summary
Prime Minister Narendra Modi visited thirumala for the third time. He came straight from Sri Lanka to Renigunta. ofter that he participated , a public meeting arranged by bjp. After that,ofter he went to thirumala, The temple officials Welcomed to the Modi during his visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X