తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్‌ ముందు రమణ దీక్షితులు కొత్త ప్రతిపాదన: టీటీడీపై విమర్శలు: వారిని ఆదుకోవాలంటూ

|
Google Oneindia TeluguNews

తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. టీటీడీలో ఇప్పటి వరకూ 743 మంది కరోనా బారిన పడ్డారు. ఇద్దరు అర్చకులూ కన్నుమూశారు. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు కరోనా వల్ల మరణించారు. ఆ విషాదం నుంచి టీటీడీ అర్చకులు, వారి కుటుంబాలు కోలుకోలేకముందే.. మరొకరు కరోనా కోరల్లో చిక్కుకుని తుదిశ్వాస విడిచారు. తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యుటేషన్‌పై తిరుమలకు వచ్చిన అర్చకుడు కరోనా వైరస్ వల్ల మృతిచెందారు.

ఈ పరిణామాలు తిరుమలలో తీవ్ర కలకలానికి దారి తీశాయి. అర్చక కుటుంబాల్లో ఆందోళనలను నింపాయి. కొద్దిరోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనాలను నిలిపివేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దగా స్పందించలేదు. భక్తుల దర్శనాలను యధాతథంగా కొనసాగిస్తూనే వస్తోంది. ఈ పరిణామాలు అటు అర్చకులు, ఇటు దేవస్థానం అధికారుల మధ్య వివాదానికీ దారి తీసింది. భక్తుల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందట్లేదనే కారణంతో టీటీడీ అధికారులు యధాతథంగా స్వామివారి దర్శనాలను కొనసాగిస్తున్నారు.

Ramana Deekshitulu requested to AP govt to sanction financial help to the deceased archakas

ఈ పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ వినిపించారు. కరోనా వైరస్ బారిన పడి కన్నుమూసిన అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోవడం వల్ల ఆయా అర్చక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చిందని చెప్పారు. సీనియర్ ప్రధాన అర్చకుడిని టీటీడీ పాలక మండలి తొలగించిందని, అనంతరం ఆయన వంశపారంపర్యాన్ని కొనసాగింపజేయడానికి పోరాడారని గుర్తు చేశారు.

45 సంవత్సరాల జూనియర్ అర్చకుడు శ్రీవారి సేవలో ఉంటూ, విధి నిర్వహణలో కరోనా వైరస్ బారిన పడ్డారని రమణ దీక్షితులు అన్నారు. కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని చెప్పారు. అర్చకులను ఆదుకోవడంలో, అర్చక కుటుంబాలకు రక్షణ కల్పించడంలో తిరుమలి తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు విఫలం అయ్యారని విమర్శించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రమణ దీక్షితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

English summary
Honorary head priest of Lord Venkateshwara Swamy temple in Tirumala A V Ramana Deekshitulu requested to AP govt to sanction financial help to the deceased archakas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X