తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.. తిరుమల శ్రీవారి సేవలో ఎస్ఈసీ నిమ్మగడ్డ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న ఆయన ఇవాళ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరసగా పర్యటనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కడప, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఏకగ్రీవాలకు ఓకే కానీ బలవంతంగా చేయొద్దని హాట్ కామెంట్స్ కూడా చేశారు.

వంకాయ, క్యారెట్, కుర్చీ.. ఇవీ ఏపీ పంచాయతీ గుర్తులు, 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం..వంకాయ, క్యారెట్, కుర్చీ.. ఇవీ ఏపీ పంచాయతీ గుర్తులు, 25 గుర్తులకు ఎస్ఈసీ ఆమోదం..

తిరుమల నిమ్మగడ్డ రమేష్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆ అఖిలాండ కోటీ బ్రహ్మండనాయకుడిని ప్రార్థించానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే నిమ్మగడ్డ.. ఈ సారి తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమై.. మీడియాను ఆశ్చర్యపరిచారు.

sec nimmagadda ramesh kumar offered prayers tirumala lord balaji

ఇటు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలంతా విరాళాలు ఇస్తున్నారని చెప్పారు. హిందువులకు అయోధ్య రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరాజిల్లనుంని ధీమాను వ్యక్తం చేశారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించానని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు.

Recommended Video

#TOPNEWS : #IndiaTogether- Rihanna, Mia Khalifa లాంటోళ్లకు Amit Shah కౌంటర్

English summary
andhra pradesh sec nimmagadda ramesh kumar offered prayers fot tirumala lord balaji
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X