తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ‌కీయ-వ్యాపార‌ ప్ర‌యోజ‌నాల కోస‌మే : ఆందోళ‌న కు కార‌ణ‌మిదే : మోహ‌న్ బాబు పై శివాజీ ఫైర్‌..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు మ‌రో న‌టుడు శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మోహ‌న్‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యం లోనే ఆందోళ‌న‌కు దిగ‌టం వెనుక కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్నించారు.అదే విధంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు సైతం మోహ‌న్‌బాబు పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న చెబుతున్న‌వ‌న్నీ అస‌త్యాలే అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారానికి రాజ‌కీయ రంగు పులుముకుంది

హ‌క్కులే కాదు..బాధ్య‌త‌లు ఉంటాయి..

ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి శివాజీ ఫిర్యాదు చేశారు. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్‌బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు. ఇప్ప‌టికే త‌న‌కు దాదాపు 20 కోట్ల మేర ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు ఉన్నాయ‌ని..ప్ర‌భుత్వ ప‌ట్టించుకోవ‌టం లేదంటూ మోహ‌న్‌బాబు ఆందోళ‌న చేస్తున్నారు.

<strong>ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!</strong>ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!

Sivaji fire on Mohan Babu : not for due..for political advantage

ప్ర‌భుత్వం నుండి కౌంట‌ర్‌..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సినీ నటుడు మోహన్‌బాబు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. మోహన్‌బాబు నిరసనకు దిగడంపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి ఆయన వంతపాడుతున్నారని కుటుంబరావు ఆరోపించారు. కక్ష పూరితంగా విమర్శలు చేస్తున్నా రని అన్నారు. ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు.

వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన ఏ రోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆయ‌న తో స‌హా కుటుంబ స‌భ్యులు ఓ రాజ‌కీయ పార్టీలో చేరుతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింద‌ని..ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఆయ‌న ఎందుకు ఈ ర‌కంగా చేస్తున్నారో అంద‌రికీ తెలుస‌న్నారు.

English summary
cine hero sivaji serious comments on Mohan Babu protest for fee re embursement. Sivaji says if Mohan Babu wants his Rights he must fight for responsibilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X