తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రంజన్ గొగొయ్

|
Google Oneindia TeluguNews

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ తోపాటు ఆయన సతీమణిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారికి నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో ఆయన పాల్గోన్నారు. కాగా శనివారం తిరుమలలోనే బస చేయనున్న గొగొయ్ ఆదివారం ఉదయం కూడ మరోసారి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గోననున్నారు.

ఈ నెల 17 న పదవి విరమణ పొందనున్న చీఫ్ రంజన్ గొగొయ్ శనివారం సాయంత్రం తిరుమల తిరుపతికి చేరుకున్నారు. ఆయన చివరి పని దినాన్ని శుక్రవారమే ముగించుకున్న ఆయన శనివారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం గొగొయ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.

supreme Court Chief Justice Ranjan Gogoi visited Thirumala

ఈ సంధర్భంగా అదనపు ఈవో ధర్మారెడ్డి గొగొయ్ దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్గించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గొగొయ్ దంపతులు పండితులు వేదాశ్వీరచనం ఇచ్చారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు.స్వామీ తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా ఆయన శనివారం తిరుమలలోనే బస చేసి ఆదివారం ఉదయం కూడ మరోసారీ శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు.

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా గొగొయ్ తన చివరి పనిదినాన్ని జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌ శుక్రవారం ముగించుకున్నారు. అనంతరం ఆయన్ను సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ గొగోయ్‌ ఈ నెల 17 పదవీ విరమణ చేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ గొగోయ్‌.. ఆ పదవిని చేపట్టిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు.

English summary
The Supreme Court Chief Justice Ranjan Gogoi along with his wife have visited Thirumala Srivari temple.they offer pooja in the evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X