• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డిక్లరేషన్ వివాదంలో వైసీపీ అండగా బీజేపీ నేత: సస్పెన్షన్‌లో ఉంటూ: ఆలయాలు ఏం బాగు పడ్డాయని

|

తిరుపతి: రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం మతం చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ముహూర్తం సమీపిస్తోన్న కొద్దీ.. దాని చుట్టే వివాదాలు ముసురుకుంటున్నాయి. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోన్న వైఎస్ జగన్.. శ్రీవారి ఆలయాన్ని సందర్శించే సమయంలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా? లేదా? అనే అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అన్యమతస్తులెవరైనా శ్రీవారి ఆలయాన్ని సంందర్శించడానికి వచ్చిన సందర్భంగా.. స్వామివారిపై తనకు అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నాయంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచీ ఈ రచ్చ సాగుతూనే ఉంది. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. వైసీపీయేతర పార్టీలన్నీ దండెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధమైన ఘటనకు సంబంధించిన వేడి చల్లారకముందే.. డిక్లరేషన్ వివాదం చెలరేగింది.

 Suspended BJP leader OV Ramana back to YSRCP on Declaration issue in Tirumala

రాజకీయ ప్రత్యర్థుల నుంచి దాడులను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్పీపీ మద్దతుగా భారతీయ జనతా పార్టీ మాజీ నేత టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓవీ రమణ గళం విప్పారు. అమరావతి విషయంలో పార్టీపై విమర్శలు చేసినందుకు.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. ప్రస్తుతం ఆయన మరోసారి బీజేపీకి వ్యతిరేక గళాన్ని వినిపించారు. తమ పార్టీ పాలనలో దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలు ఏ మాత్రం బాగుపడిన దాఖలాలు లేవని అన్నారు.

  AP Police Seva App Launch | అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు, దేశంలోనే తొలిసారి!!

  తిరుమల డిక్లరేషన్‌పై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు బాధాకరమని చెప్పారు. డిక్లరేషన్‌ ఇవ్వాలా? వద్దా? అనేది భక్తుల ఇష్టం అని దీనిపై అనవసరంగా రద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ఆలయంలో కూడా డిక్లరేషన్‌ విధానం లేదని చెప్పారు. ఏ ఆలయాన్ని, ఆ మతానికి చెందిన వారైనా దర్శించుకోవచ్చని చెప్పారు.దేశంలో ఎక్కడా లేని అభ్యంతరం తిరుమలలోన ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఏ ఒక్క ఆలయమైనా బాగు.డిందని తాను అనుకోవట్లేదని చెప్పారు. బీజేపీ ఏ మతానికి చెందిన వారైనా.. ఏ ఆలయాన్నయినా సందర్శించుకునే అధికారం ఉందని చెప్పారు.

  English summary
  OV Ramana, Bharatiya Janata Party Andhra Pradesh leader who is under suspension back to YSRCP Government on declaration issue in Tirumala. He was former TTD Board member also.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X