• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి ప్రచారంలో టీడీపీ న్యూ ట్రెండ్‌-రంగంలోకి యువ నేతలు- స్పెషల్‌ అట్రాక్షన్‌

|

తిరుపతి ఉపఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న టీడీపీ ఈసారి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ నేతల్ని తిరుపతి ప్రచారంలోకి దింపింది. కేశినేని శ్వేత, బండారు శ్రావణి, హరీష్‌ బాలయోగి, శ్రావణ్‌, కీర్తి వంటి యువ నేతలు ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎస్వీ యూనివర్శిటీతో పాటు యువ ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ వీరు ఓటర్లతో సులువుగా మమేకమవుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై చర్చిస్తూ వారి పల్స్‌ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తిరుపతి ప్రచారంలో న్యూ ట్రెండ్‌

తిరుపతి ప్రచారంలో న్యూ ట్రెండ్‌

గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ ట్రెండ్‌ మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో స్ధానిక నేతలతో పాటు పార్టీలో కీలక నేతల్ని ఎంచుకుని స్టార్‌ క్యాంపెయినర్లుగా బరిలోకి దించే టీడీపీ ఈసారి వారితో పాటు యువ కెరటాలకు భారీ ఎత్తున ప్రచార బరిలోకి దింపింది. వీరంతా దాదాపుగా పార్టీలో సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ఎంపీల పిల్లలే కావడం మరో విశేషం. ప్రస్తుంత వీరంతా తిరుపతి ఉపఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మరో పది రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరి ప్రచారం టీడీపీకి అదనపు ఆకర్షణగా మారుతోంది.

 ప్రత్యేక ఆకర్షణగా టీడీపీ యువ కెరటాలు

ప్రత్యేక ఆకర్షణగా టీడీపీ యువ కెరటాలు

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ఈసారి టీడీపీ యువ నేతలు ఎక్కువగా హల్‌చల్ చేస్తున్నారు. వీరిలో విజయవాడ ఎంపీ కుమార్తె కేశినేని శ్వేత, శింగనమల పార్టీ ఇన్‌ఛార్జ్‌ యామినీ బాల కుమార్తె బండారు శ్రావణి, దివంగత ఎంపీ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్, మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్‌ తనయుడు ఆశిష్‌ లాల్‌, రవి నాయుడు, కపిల్ చౌదరి, కీర్తి, శ్రవణ్ వంటి వారు తొలిసారి ఈ స్ధాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరంతా ఇప్పటివరకూ కలిసి ఒక్క చోట ప్రచారం చేసింది లేదు. తొలిసారిగా వీరంతా తిరుపతి ప్రచార బరిలోకి దిగడంతో టీడీపీ యువ నేతల బలం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.

యువ ఓటర్లపై టీడీపీ గురి

యువ ఓటర్లపై టీడీపీ గురి


ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ స్ధానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అంతా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయా సెగ్మెంట్లలో యువ ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత అవసరం ఉంది. దీంతో టీడీపీ యువ నేతలంతా ఒకేసారిగా ప్రచార బరిలోకి దిగారు. వీరిలో చాలా మంది ఒకరికొకరు పరస్పరం పరిచయం ఉన్న వారు కూడా కాదు. అయినా వీరంతా తొలిసారి పార్టీ అభ్యర్ధి విజయం ప్రచారం చేస్తున్నా విన్నూత్నంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తిరుపతి ఎస్వీ యూనివర్శిటీతో పాటు విద్యార్ధులు, యువత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరు ప్రచారం నిర్వహిస్తున్నారు.

టీడీపీ యువనేతల ప్రత్యేకతలివే

టీడీపీ యువనేతల ప్రత్యేకతలివే

తిరుపతి బరిలో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ యువనేతల్లో చాలా మంది విభిన్న నేపథ్యాలు కలిగిన వారు. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతకు గతంలో అమెరికాలో హిల్లరీ క్లింటర్‌ తరఫున ప్రచారం చేసిన అనుభవం ఉంది. అలాగే తండ్రి కేశినేని విజయం కోసం మూడు ఎన్నికల్లో ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. హరీష్‌ మాథుర్‌కు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ తరపున పనిచేసిన అనుభవంతో పాటు విద్యార్హతలూ ఉన్నాయి. బండారు శ్రావణి, శ్రవణ్, కీర్తి, ఆశిష్ లాల్‌ ఇలా ప్రతీ ఒక్కరూ విభిన్న రంగాల్లో ప్రతిభావంతులే. అందరూ యువతీయువకులే కావడంతో సులువుగా కలిసిపోతూ ప్రచారంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

English summary
opposition tdp has fielded its youth leaders in tirupati byelection campaign for grabbing youth votes. kesineni swetha, bandaru sravani, keerthi, sravan are some of the leaders campaigning for tdp candidate panabaka lakshmi in tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X