తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సరికొత్త శోభతో తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం: రోజూ ఎంతమంది భక్తులు దర్శిస్తారంటే?

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. శనివారం నుంచి 27వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో క్రిక్కిరిసిపోయే తిరుమలగిరులు ఆ సారి బోసిపోయాయి.

బీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురంబీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురం

 సాయంత్రం అంకురార్పణతో..

సాయంత్రం అంకురార్పణతో..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఉత్సవాలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. రాత్రి నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. సకల దేవతలనూ ఆహ్వానిస్తారు అర్చకులు. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషుడిపై స్వామివారిని ఊరేగిస్తారు. పెదశేషవాహన సేవతో బ్రహ్మోత్సవాల్లో మలిదశ ఆరంభమౌతుంది.

 తిరుమలకు వైఎస్ జగన్..

తిరుమలకు వైఎస్ జగన్..

బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గరుడసేవ నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. రెండు రోజుల పాటు వైఎస్ జగన్.. తిరుమలలోనే గడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా అదే సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి రానున్నారు. వైఎస్ జగన్‌తో కలిసి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ గెస్ట్‌హౌస్ నిర్మితం కానుంది. దీనికి అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కర్ణాటక సర్కార్‌కు కేటాయించింది.

Recommended Video

Sadineni Yamini పై కేసు వేసిన TTD అధికారులు.. కారణం ఇదే!!
రోజూ 12 వేలమందికి దర్శనభాగ్యం..

రోజూ 12 వేలమందికి దర్శనభాగ్యం..

ఇదివరకట్లా భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మాత్రమే తిరుమలకు రావడానికి వీలు కల్పించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ 12 వేలమందికి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ మేరకు ఆన్‌లైన్ టికెట్లను జారీ చేశారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని కౌంటర్ల ద్వారా టికెట్లను జారీ చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లను జారీని తాత్కాలికంగా రద్దు చేశారు. శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు రావడం ఖాయమైంది. పలువురు మంత్రులు, ఎంపీలు స్వామివారిని దర్శించుకోనున్నారు. వారికోసం తిరుపతి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

English summary
The Tirumala Tirupati Devasthanams is conducting the annual Brahmotsavams of Lord Venkateswara from September 19-27 in Ekantham in view of the Covid-19 pandemic situation and the prescribed restrictions. During the festival, 12,000 devotees would be provided darshan every day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X