తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల డిక్లరేషన్ రగడ ... నిబంధన మార్చటం అనాచారం .. చంద్రబాబు , రఘురామ ఫైర్

|
Google Oneindia TeluguNews

టిటిడి డిక్లరేషన్ రగడ ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. ఎప్పటి నుండో ఉన్న ఈ నిబంధనను మార్చడం మీ ఇష్టమేనా అని ప్రశ్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా వస్తున్న డిక్లరేషన్ ను పాటించాల్సిన అవసరం లేదన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టిడిపి అధినేత చంద్రబాబు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

తిరుమల డిక్లరేషన్ రగడ ... ఎప్పటి నుండో ఉన్న ఈ నిబంధన టీటీడీ ఎప్పుడు తొలగించింది?తిరుమల డిక్లరేషన్ రగడ ... ఎప్పటి నుండో ఉన్న ఈ నిబంధన టీటీడీ ఎప్పుడు తొలగించింది?

ధర్మ సాంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు : చంద్రబాబు

ధర్మ సాంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు : చంద్రబాబు

డిక్లరేషన్ అవసరం లేదంటూ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో చంద్రబాబు స్పందించారు . ఇది అనాచారమని ఫైర్ అయ్యారు . ఆయన చేసిన ట్వీట్ లో మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమే. ఏషః ధర్మః సనాతనః అన్నారు వాల్మీకి. సనాతనం అంటేనే ప్రాచీనమైన, నిత్యమైన , ఏనాటికి మారని శాశ్వత ధర్మం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి ధర్మ సాంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు తెలియజేశారు. అలా మార్చుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే అంటూ చంద్రబాబు విమర్శించారు.

 నమ్మకం లేని వ్యక్తి కోసం నిబంధన మార్చటం అనాచారం

నమ్మకం లేని వ్యక్తి కోసం నిబంధన మార్చటం అనాచారం

అసలు మతం అంటేనే నమ్మకం అన్న చంద్రబాబు అసలు డిక్లరేషన్ ఉద్దేశాన్ని చెప్పారు. ఎవరైనా సరే స్వామి పై నమ్మకంతో రావడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు డిక్లరేషన్ పెట్టారంటూ పేర్కొన్నారు. ఒక నమ్మకం లేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సాంప్రదాయాన్ని మార్చడం అనాచారం అంటూ చంద్రబాబు మండిపడ్డారు . సమాజానికి అరిష్టమని , ఆధ్యాత్మిక ద్రోహం కూడా అంటూ చంద్రబాబు తిరుమలలో అన్య మతస్థులకు స్వామివారి దర్శనానికి నో డిక్లరేషన్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

 సీఎం జగన్ డిక్లరేషన్ పాటించకపోవటం సరైంది కాదన్న ఎంపీ రఘురామ

సీఎం జగన్ డిక్లరేషన్ పాటించకపోవటం సరైంది కాదన్న ఎంపీ రఘురామ

ఇదే సమయంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా వస్తున్న డిక్లరేషన్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి పాటించకపోవడం సరైంది కాదంటూ విమర్శించారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఆనాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి ప్రముఖులు డిక్లరేషన్ ఇచ్చి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు అని గుర్తు చేశారు డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేయాలని ఆనాడు గవర్నర్ ఆదేశించారని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు.

Recommended Video

TDP Leader Durga Prasad Paid Tribute To Kodela Sivaprasad On 1st Anniversary
సీఎం జగన్ సెక్యులర్ .. ఇతర మతస్తుల మనోభావాలు గౌరవించాలి

సీఎం జగన్ సెక్యులర్ .. ఇతర మతస్తుల మనోభావాలు గౌరవించాలి

గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారి దర్శనం చేసుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సెక్యులర్ అని తాను భావిస్తున్నట్లు గా పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాల పై తనకు గౌరవం నమ్మకం ఉందన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇతర మతస్తుల మనోభావాలను గౌరవించాలని సలహా ఇచ్చారు. వై వి సుబ్బారెడ్డి డిక్లరేషన్ అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

English summary
The TTD Declaration row has become a hot topic in AP right now. Leaders of opposition parties are angry. TDP chief Chandrababu and Narasapuram MP Raghuram Krishnaraja were angry over TTD chairman YV Subbareddy's remarks that there was no need to follow the declaration coming for the last decade at the Tirumala Tirupati temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X