శ్రీవారి సేవలో భక్తజనులు: వీకెండ్ ఫుల్ రష్, 29న బ్రేక్ దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సమ్మర్ కావడం.. కరోనా ఇంపాక్ట్ అంతగా లేకపోవడంతో తమ మొక్కులను భక్తులు చెల్లించుకుంటున్నారు. ఇక వీకెండ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీవారి దర్శనం కోసం టికెట్లు తీసుకొనేందుకు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. 5 కేంద్రాల్లో శనివారం తెల్లవారుజామునుంచే వేచి చూస్తున్నారు.

ఒక్కో వెహికిల్ చెకింగ్ కోసం అరగంట
టోకెన్ల కౌంటర్ వద్ద, అలిపిరి వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు కొండపైకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. టీటీడీ విజిలెన్స్ ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తోంది. ఒక్కో వాహన తనిఖీకి 30 నిమిషాలు పడుతుందని తెలుస్తోంది. సెలవు వస్తే చాలు తిరుమలకు వస్తున్నారు. దీంతో వీకెండ్లో కొండపై అద్దె గదులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ లైన్లు, భక్తుల వసతి సదుపాయం తనిఖీ చేయడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు పాలు, ఆహారం అందించాలని అధికారులను ఆదేశిచారు.

బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల
శ్రీవారి
ఆలయంలో
శుభకృత్
నామ
సంవత్సర
ఉగాది
ఆస్థానం
జరుగనున్న
నేపథ్యంలో
మార్చి
29వ
తేదీన
మంగళవారం
కోయిల్
ఆళ్వార్
తిరుమంజనం
నిర్వహిస్తారు.
ఆ
రోజు
బ్రేక్
దర్శనాలు
రద్దు
చేశారు.
మార్చి
28వ
తేదీ
సోమవారం
సిఫారసు
లేఖలు
స్వీకరించబడవని
టీటీడీ
పేర్కోంది.
భక్తులు
గమనించి
టీటీడీకి
సహకరించాలని
కోరారు.
ఏడాదిలో
నాలుగుసార్లు
కోయిల్
ఆళ్వార్
తిరుమంజనం
నిర్వహించడం
ఆనవాయితీ.
ఉగాది,
ఆణివార
ఆస్థానం,
బ్రహ్మోత్సవాలు,
వైకుంఠ
ఏకాదశి
పర్వదినాల
ముందు
మంగళవారం
ఆలయ
శుద్ధి
కార్యక్రమాన్ని
నిర్వహిస్తారు.

ఉదయం 11 గంటల వరకు
కోయిల్
ఆళ్వార్
తిరుమంజనం
రోజున
ఉదయం
6
నుండి
11
గంటల
వరకు
ఆలయ
శుద్ధి
కార్యక్రమాన్ని
అర్చకులు
ఆగమోక్తంగా
నిర్వహిస్తారు.
ఆలయంలో
గల
ఆనందనిలయం
మొదలుకొని
బంగారువాకిలి
వరకు,
శ్రీవారి
ఆలయం
లోపల
ఉప
ఆలయాలు,
ఆలయ
ప్రాంగణం,
గోడలు,
పైకప్పు,
పూజాసామగ్రి
తదితర
అన్ని
వస్తువులను
నీటితో
శుభ్రంగా
కడుగుతారు.

మూలవిరాట్టును వస్త్రంతో కప్పి
స్వామివారి
మూలవిరాట్టును
వస్త్రంతో
పూర్తిగా
కప్పి
వేస్తారు.
శుద్ధి
పూర్తి
అయిన
అనంతరం
నామకోపు,
శ్రీ
చూర్ణం,
కస్తూరి
పసుపు,
పచ్చాకు,
గడ్డ
కర్పూరం,
గంధం
పొడి,
కుంకుమ,
కిచీలిగడ్డ
తదితర
సుగంధ
ద్రవ్యాలు
కలగలిపిన
పవిత్ర
పరిమళ
జలాన్ని
ఆలయం
అంతటా
ప్రోక్షణం
చేస్తారు.
తర్వాత
స్వామివారి
మూలవిరాట్టుకు
కప్పిన
వస్త్రాన్ని
తొలగించి
ప్రత్యేక
పూజ,
నైవేద్యం
కార్యక్రమాలను
అర్చకులు
శాస్త్రోక్తంగా
నిర్వహిస్తారు.
మధ్యాహ్నం
12
గంటల
నుంచి
భక్తులను
సర్వదర్శనానికి
అనుమతిస్తారు.