తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైకుంఠ ఏకాద‌శికి తిరుమ‌ల ముస్తాబు : భక్తుల‌కు భారీ ఏర్పాట్లు..

|
Google Oneindia TeluguNews

కోట్లాది భ‌క్తుల‌కు కొలువైన తిరుమ‌ల కొండ వైకుంఠ ఏకాద‌శి కోసం వివేషంగా ముస్తాబ‌వుతోంది. తిరుమ‌ల - తిరుప‌తి దేవ‌స్థానం ఈ సారి వైకుంఠ ఏకాద‌శి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లను చేస్తోంది. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో జరిగే విశేష పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తర్వాత వైకుంఠ ఏకాదశికే లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. రెండు నెలల నుంచే ప్రణాళికబద్ధంగా తితిదే ఏర్పాట్లు ప్రారంభించింది. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వ‌చ్చే యాత్రికుల కోసం ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.

Tirumala Ready for Vaikunta Ekadasi : Special arrangements made..

తిరుమ‌ల లో ఈ రెండు రోజులు పోటెత్తే భ‌క్త జ‌నం కోసం నారాయణగిరి ఉద్యానవనం, తిరువీధుల్లో మూడు వైపుల గ్యాల రీలపై జర్మన్‌ పరిజ్ఞానంతో అత్యాధునిక షెడ్లను ఏర్పాటు చేసింది. నారాయణగిరి ఉద్యానవనంలో 18,500 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా 16 షెడ్లు నిర్మించారు. అధికారులు, సిబ్బందిని భక్తులకు సేవలందించడా నికి 10 సెక్టార్లుగా విభజించింది. తిరువీధుల్లో 40 వేల మంది కూర్చునేందుకు వీలుగా 14 షెడ్లు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సిబ్బంది విధుల నిర్వ‌హ‌ణ కోసం ప‌ర్య‌వేక్షకుల‌ను నియ‌మించారు. ఉత్స‌వాలు తిల‌కించ టం కోసం మేదరమిట్ట వద్ద ఉన్న ఎన్‌-1 గేటు నుంచి భక్తులను తిరువీధుల్లోని షెడ్లలోకి అనుమతిస్తారు. ఈ షెడ్లలో భక్తులకు అన్ని వసతులను కల్పించింది. ప్ర‌స్తుతం ఏపిలో తుఫాను ప్ర‌భావం కార‌ణంగా అద‌నపు ఏర్పాట్లు చేస్తున్నా రు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌చ్చిన స‌మ‌యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితిలోనూ అసౌకర్యం కలగకుండా జాగ్ర త్తలు తీసుకుంటున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్న‌ట్లు టిటిడి అధికారు లు చెబుతున్నారు.

భ‌క్తుల ర‌ద్దీ వ‌ల‌న ఇబ్బందుల లేకుండా తిరుమ‌ల కు వ‌చ్చే ప్ర‌తీ భ‌క్తుడికి సేవ‌లు క‌నిపించేలా ప్ర‌త్యేకంగా ఎల్ఇడి స్క్రీన్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. షెడ్లలో భక్తులకు సేవలందించడానికి శ్రీవారి సేవకులను నియమించారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనంగా సిబ్బందిని నియమించారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను షిఫ్టుల‌ వారీగా నియమించారు. ఇప్ప‌టికే వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల పై తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు తో పాటుగా ఈవో సింఘాల్ ప్ర‌త్యేక దృష్టి సారించారు.

English summary
TTD prepared well for Vaikunta Ekadasi. lakhs of devotees may attend for this festival. TTD Board and E.O personally supervising accomidation and facilities for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X