• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీవారి సర్వదర్శన టికెట్లు త్వరలో ఆన్‌లైన్‌లోనూ: భక్తులకు తీరనున్న కష్టాలు

|

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త అందించింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవల పునఃప్రారంభించిన టీటీడీ.. ఇందుకు సంబంధించి టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

తాజాగా, ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. త్వరలో ఆన్‌లైన్‌లోనూ సర్వదర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. దీనిపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఎక్కువ మందికి శ్రీవారి సర్వదర్శనం కల్పించాలని కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారంలోపు సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

tirumala: sarva darshan tickets available in online soon, says ttd.

సెప్టెంబర్ 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్‌‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో కరోనా నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని, నిబంధనలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక నుంచి రోజుకి 8 వేల చొప్పున ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది మే నాటికి బంగారు తాపడం పనులు పూర్తి : వైవీ.సుబ్బారెడ్డి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో సెప్టెంబ‌రు 9వ తేదీ నుండి జరుగుతున్న బాలాల‌య కార్యక్రమాలు సోమవారం సంప్రోక్ష‌ణంతో ముగిశాయి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 1972వ సంవత్సరంలో ఆలయ విమాన గోపురం పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని 2018వ సంవత్సరంలో టిటిడి బోర్డు నిర్ణయించిందని చెప్పారు. రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, ఇందుకోసం 100 కిలోల బంగారం, 4300 కిలోల రాగి వినియోగిస్తున్నామని వివరించారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యధావిధిగా ఉంటుందని, కైంకర్యాలన్నీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తారని తెలియజేశారు.

అంతకుముందు ఉద‌యం యాగ‌శాలలో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, దివ్య‌ప్ర‌బంధ శాత్తుమొర నిర్వ‌హించారు. అనంతరం బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌ట్టారు. మ‌ధ్యాహ్నం నిత్య‌క‌ట్ల కైంక‌ర్యం, సాయంత్రం యాగ‌శాల‌ వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈఓ సదా భార్గవి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, ఎఫ్ఏసిఏఓ బాలాజీ, విఎస్వో మనోహర్, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు .శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో ఎం ర‌వికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

శ్రీనివాసమంగాపురంలో మినీ కల్యాణకట్ట ప్రారంభం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలితో పూజ చేయించారు. ఆలయంలోని కల్యాణమండపం పక్కన మినీ కల్యాణకట్టను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం ఇక్కడ స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ ధనంజయుడు, సూపరింటెండెంట్ చెంగల్రాయలు‌, అర్చకస్వాములు పాల్గొన్నారు.

వధూవరులకు బంగారు తాళిబొట్టు, పట్టువస్త్రాలు, మెట్టెల కానుక ప్రారంభం

చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు, తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం తుమ్మలగుంటలో లాంఛనంగా ప్రారంభించారు. వివాహం చేసుకోబోతున్న 7 జంటలకు ఆయన ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నియోజక వర్గానికి చెందినవారు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక అందించే కార్యక్రమం శాశ్వతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 12 ఏళ్లుగా తుమ్మల గుంట లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకునే జంటలకు ఈ కానుకలు ఇసున్నారని ఆయన చెప్పారు. ఇకపై చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వధువు లేదా వరుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఈ కానుక లన్నీ అందజేసే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైందని సుబ్బా రెడ్డి చెప్పారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.

శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా తుమ్మలగుంటలో వివాహం చేసుకునే జంటలకు బంగారు తాళిబొట్టు, మెట్టెలు, పట్టుబట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇకపై నియోజకవర్గానికి చెందిన వారు ఎక్కడ వివాహం చేసుకున్న ఈ కానుకలు అందజేస్తామని తెలిపారు. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆలయ అర్చకులు చైర్మన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

త్వరలోనే సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంపు : టిటిడి చైర్మన్

పేదలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో నాలుగు రోజుల క్రితం నుంచి రోజుకు 2 వేల సర్వ దర్శనం టోకెన్లు జారీ ప్రారంభించామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చామన్నారు. టోకెన్లు పొందడానికి కౌంటర్ల వద్దకు వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సర్వ దర్శనం టికెట్ల సంఖ్య మరింత పెంచేందుకు అధికారులతో చర్చించామన్నారు.

English summary
tirumala: sarva darshan tickets available in online soon, says ttd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X