తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tirumala: అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, శ్రీవారి దర్శనభాగ్యం, గోవిందా గోవింద!

|
Google Oneindia TeluguNews

తిరుమల/తిరుపతి: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Rathotsavam: తిరుమలలో వేడుకగా రథోత్సవం, భక్తుల మనోరథాన్ని అధిరోహించి!Rathotsavam: తిరుమలలో వేడుకగా రథోత్సవం, భక్తుల మనోరథాన్ని అధిరోహించి!

అశ్వ స్వరూపంలో శ్రీవారు

అశ్వ స్వరూపంలో శ్రీవారు

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

గోవిందా.... గోవింద

గోవిందా.... గోవింద

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్ కు చెందిన సురభి ఆర్ట్స్ శ్రీ వినాయక నాట్య మండలి శ్రీనివాస కల్యాణం పౌరాణిక నాటకం అద్భుతంగా ప్రదర్శించింది .శ్రీ ఆర్.వేణుగోపాల్ బృందం 45 మంది మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం సభాసదులను భక్తిరస సాగరంలో ఓలలాడించింది .

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

తిరుపతి పుర ప్రముఖులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.అలాగే అన్నమాచార్య కళా మందిరంలో బెంగుళూరుకు చెందిన కుమారి ఐశ్వర్య మహేష్ బృందం భక్తి సంగీత గానం భక్తులను ఆకట్టుకుంది .ఈ కార్య్రమంలో కుమారి ఐశ్వర్య మహేష్, చక్రపాణి, బాలసుబ్రమణ్యం సహకరించారు.

English summary
Tirumala: The Rathotsavam of Tirumala is significant for its salient features. It is a 35 mammoth wooden chariot being dragged by devotees and temple staff with the help of secure four inch thick jute ropes and hydraulic brakes along the four Mada streets surrounding the temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X