• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kathi Mahesh: తిరుపతిలో బీజేపీకి ఓడిపోవడానికి పవన్ కల్యాణ్ ఒక్కడు చాలు

|

తిరుపతి: తిరుపతి లోక్‌సభకు నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు పెద్ద స్కేచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వ్యూహాత్మకంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను బరిలోకి దించిన కమలనాథులు.. ఆమెను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఓ సారి తిరుపతి లోక్‌సభపై బీజేపీ జెండా ఎగిరిన చరిత్ర ఉన్న నేపథ్యంలో.. మరోసారి దాన్ని పునరావృతం చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

రత్నప్రభ కోసం మాదిగ నేతలు..

రత్నప్రభ కోసం మాదిగ నేతలు..

రత్నప్రభను లోక్‌సభకు పంపించడానికి మాదిగ నేతలు ఏకమౌతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో సైద్ధాంతిక పరంగా అనేక విభేదాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కన పెట్టి రత్నప్రభను గెలిపించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాదిగ నేతలు ఒకే వేదిక మీదికి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రత్యేకించి- తెలంగాణకు చెందిన ప్రముఖ మాదిగ నేత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మంద కృష్ణ మాదిగ.. రత్నప్రభ కోసం తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగొచ్చని సమాచారం. దీనికి ఆయన అంగీకరించాల్సి ఉందని చెబుతున్నారు.

కత్తి మహేష్ కూడా..

కత్తి మహేష్ కూడా..

మాదిగ సామాజిక వర్గానికే చెందిన కత్తి మహేష్ కూడా రత్నప్రభ కోసం ప్రచారానికి రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రత్నప్రభతో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలతో కలిసి ఆయన రత్నప్రభతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్ ద్వారా వెల్లడించారు. రత్నప్రభ, ఇతర మాదిగ నేతలతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను పోస్ట్ చేశారు. బీజేపీతో మాత్రమే కాదు.. ఆ పార్టీ మిత్రపక్షం జనసేనతోనూ సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నందున రత్నప్రభకు మద్దతుగా ప్రచారానికి రావడంపై కత్తి మహేష్ తీసుకునే తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠత రేపుతోంది

చిత్తూరు జిల్లాలో మాదిగల్లో ఐకమత్యం లేదంటూ..

చిత్తూరు జిల్లాలో మాదిగల్లో ఐకమత్యం లేదంటూ..

రత్నప్రభతో సమావేశమైన అనంతరం తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో కత్తి మహేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో మాదిగ నాయకత్వం లేదని, మాదిగలలో ఐకమత్యం లేదని పేర్కొన్నారు. ఆర్ధిక వనరులు అంతకన్నా లేవని స్పష్టం చేశారు. స్థానికి మాలలతో పాటు తమిళ మాలలదే ఇక్కడ తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు మాలలకే ప్రాధాన్యత ఇస్తాయని స్పష్టం చేశారు. జిల్లాలో మాల-మాదిగల నిష్పత్తికి తేడా మూడుశాతాన్ని మించకపోయినప్పటికీ, మాలలే ఎక్కువ శాతం ఉన్నారనే నమ్మకం రాజకీయ వర్గాలలో బలంగా ఉందని చెప్పారు.

ఓడిపోయే సీటులో

ఓడిపోయే సీటులో

అంతమాత్రంతో ఓడిపోయే సీటులో బీజేపీ లాంటి దళిత వ్యతిరేక పార్టీ నిలబెట్టిన స్థానికేతర మాదిగ మాజీ ఐఏఎస్ అధికారిణికి ఓటు వెయ్యాలనే వాదనలో చాలా లోపం ఉందని కత్తి మహేష్ చెప్పారు. చిత్తూరు జిల్లాకి సంబంధించిన మాదిగ తన దృక్కోణం దీనికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మాదిగలకు రెప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి, మొత్తంగా దళితులకే అన్యాయం చేసే బీజేపీకి ఓటెయ్యడం, తన మనసుకి నచ్చదని తేటతెల్లం చేశారు. తన వైఖరేమిటో కత్తి మహేష్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇక మంద కృష్ణ మాదిగ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందనేది ఆసక్తిగామారింది.

 ఆ ప్రకటన ఒక్కటి చాలు..

ఆ ప్రకటన ఒక్కటి చాలు..

తిరుపతిలో గెలిస్తే పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ ఓడిపోవడానికి ఈ ప్రకటన ఒక్కటి చాలని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరుకు రెఫరెండంగా తీసుకుంటామంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. ఇది గుర్తుపెట్టుకొండి..ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మాట్లాడదామంటూ చెప్పారు. తిరుపతిలో బీజేపీకి పరాజయం తప్పదని కత్తి మహేష్ స్పష్టం చేశారు.

English summary
Madiga leader Manda Krishna Madiga from Telangana is likely to campaign in Tirupati Lok Sabha by elections 2021 for BJP-Jana Sena candidate and retired IAS officer Ratna Prabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X