తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి బైపోల్: నడ్డాతో పవన్ భేటీ -చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి -29 నుంచే ప్రచారంలోకి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరుగనున్న తొలి ఉప ఎన్నిక కావడంతో తిరుపతి లోక్ సభను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలోని దుబ్బాకలో సిట్టింగ్ నేత కుటుంబానికి టికెటిచ్చి టీఆర్ఎస్ దెబ్బతిన్న నేపథ్యంలో తిరుపతిలో అలాంటి పొరపాటుకు తావు లేకుండా కొత్త అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని బరిలోకి దింపాలని వైసీపీ డిసైడైంది. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ తమకే కావాలంటోన్న జనసేనకు సంబంధించి కూడా తాజా అప్ డేట్స్ ఇలా ఉన్నాయి..

బీజేపీ భారీ స్ట్రోక్: పవన్‌, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?బీజేపీ భారీ స్ట్రోక్: పవన్‌, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?

 ఎట్టకేలకు పీకేకు టైమ్..

ఎట్టకేలకు పీకేకు టైమ్..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీకి జనసేనకు అవకాశం ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ పట్టుపడుతున్నారు. ఈ విషయమై బీజేపీ హైకమాండ్ తో మాట్లాడేందుకుగానూ మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన ఆయనకు సుదీర్ఘ పడిగాపుల అనంతరం ఎట్టకేలకు అపాయింట్మెంట్లు లభించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ బుధవారం భేటీ అయ్యారు..

చర్చలంటూనే వ్యూహాత్మకంగా..

చర్చలంటూనే వ్యూహాత్మకంగా..

బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీలో పవన్.. తిరుపతి ఉప ఎన్నిక, ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తిరుపతి టికెట్ తమకు వదిలేయాలంటూ పవన్ కోరగా, ఏపీ నేతలతో మరోసారి మాట్లాడి తుది నిర్ణయం చెబుతానని నడ్డా అన్నట్లు సమాచారం. తిరుపతిలో కూడా త్యాగం చేస్తే, మరో రకంగానైనా సర్దుబాటు చేస్తామని కూడా నడ్డా అభిప్రాయపడినట్లు వినికిడి. వీరి భేటీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే తిరుపతి టికెట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న ఏపీ బీజేపీ.. వరుస సమీక్షలు నిర్వహిస్తూ, కీలక నేతల ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేసే పనిలో బిజీగా ఉంది. మరోవైపు..

 చంద్రబాబుతో పనబాక భేటీ

చంద్రబాబుతో పనబాక భేటీ

తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకటన వెలువడి 10 రోజులైనా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనబాక పోటీ నుంచి తప్పుకోనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఒకదశలో హైకమాండ్ రాయబారిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పనబాక ఇంటికి వెళ్లి చర్చలు చేశారు. అవి ఫలించాయనడానికి సంకేతంగా బుధవారం సాయంత్రం.. పనబాక లక్ష్మి.. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.

 29 నుంచే పనబాక పోరు..

29 నుంచే పనబాక పోరు..

టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పనబాక లక్షి భేటీ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో పనబాకతో పాటు ఆమె భర్త కృష్ణయ్య, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ప్రత్యర్థుల ప్రచారాలకు చెక్ పెడుతూ పనబాక ఈ వారంతం నుంచే ఎన్నికల పోరును ప్రారంభించనున్నారు. తిరుపతిలో టీడీపీ ప్రచార కార్యాలయాన్ని పనబాక దంపతులు శనివారం(29న) ప్రారంభించనున్నారు.

కరోనా విలయం: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ -డిసెంబర్ 1 నుంచి కంటైన్మెంట్ ఇంకా కఠినంగా -ముఖ్యాంశాలివేకరోనా విలయం: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ -డిసెంబర్ 1 నుంచి కంటైన్మెంట్ ఇంకా కఠినంగా -ముఖ్యాంశాలివే

English summary
amid tirupati loksabha by election, jana sena chief pawan kalyan meets bjp national president jp nadda at delhi on wednesday. on the other side, tirupati tdp candidate panabaka laxmi meets tdp chief chandrababu at amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X