• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

|

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ముందుగా, మూడు నెలల కిందటే టీడీపీ తన అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును అధికారికంగా ప్రకటించగా, మంగళవారం బైఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన కాసేపటికే అధికార వైసీపీ సైతం డాక్టర్ గురుమూర్తి పేరును లాంఛనంగా వెల్లడించింది. ఇక తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న బీజేపీ రెండు పేర్లను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉనికి నిలుపుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సైతం పేరున్న అభ్యర్థినే మరోసారి బరిలోకి దింపాలనుకుంటోంది..

మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!

మాజీ ఐఏఎస్‌కే బీజేపీ టికెట్

మాజీ ఐఏఎస్‌కే బీజేపీ టికెట్

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా, జనసేనతో విభేదాల కారణంగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి జనసేనాని పవన్ కల్యాణ్ తో గతవారం చివరి దఫా చర్చలు జరిపిన కమలనాథులు.. తామే బరిలో ఉంటామని, జనసేన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళవారం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రధానంగా .. కర్ణాటక మాజీ చీఫ్ సెక్రటరీ కత్తి రత్నప్రభ, స్థానికుడైన మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఏది ఏమైనా తిరుపతి బీజేపీ టికెట్ మాజీ ఐఏఎస్ అధికారికే దక్కబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే..

షాకింగ్: బట్టలు విప్పి వీడియో తీశారు -జోగిని శ్యామలపై మహిళ ఫిర్యాదు -జీరో ఎఫ్ఐఆర్ -భారీ ట్విస్ట్షాకింగ్: బట్టలు విప్పి వీడియో తీశారు -జోగిని శ్యామలపై మహిళ ఫిర్యాదు -జీరో ఎఫ్ఐఆర్ -భారీ ట్విస్ట్

రత్నప్రభ వర్సెస్ శ్రీనివాసులు

రత్నప్రభ వర్సెస్ శ్రీనివాసులు

తిరుపతిలో బీజేపీ అభ్యర్థిత్వానికి సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారులైన కత్తి రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు మధ్య పోటీ నెలకొంది. కచ్చితంగా ఆ ఇద్దరిలో ఒకరికే టికెట్ దక్కుతుందని జాతీయ స్థాయిలోనూ వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ కర్ణాటక సీఎస్ గా రిటైరైన తర్వాత వృత్తి నైపుణ్య అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆమె కొంతకాలం పాటు డిప్యుటేషన్‌పై ఏపీలోనూ పనిచేశారు. రత్నప్రభ తండ్రి కత్తి చంద్రయ్య, సోదరుడు ప్రదీప్‌ చంద్ర, భర్త విద్యా సాగర్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు. ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రత్నప్రభ అయితే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఆమెకు అవకాశం కల్పించాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో..

చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు

చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు

బీజేపీ క్యాండిడేట్ గా రత్నప్రభ కంటే ముందునుంచే స్థానికుడైన దాసరి శ్రీనివాసులు పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల కిందటే బీజేపీలో చేరారు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆయన, బీజేపీ మార్కు హిందూత్వను కూడా గట్టిగానే ప్రమోట్ చేశారు. రత్నప్రభ, దాసరితోపాటు మరో సివిల్స్ మాజీ అధికారి, బీజేపీ ఎస్సీ మోర్చాకు చెందిన సునీల్‌ కుమార్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు పేర్లను సైతం బీజేపీ హైకమాండ్ పరిశీలించింది. అయితే టికెట్ మాత్రం రత్నప్రభ, శ్రీనివాసుల్లో ఒకరికే దక్కనున్నట్లు తెలుస్తోంది. సునీల్, రావెల వర్గీయులు మాత్రం చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనతో విభేదాల నేపథ్యంలో..

జనసేన -బీజేపీ మధ్య పెరిగిన గ్యాప్

జనసేన -బీజేపీ మధ్య పెరిగిన గ్యాప్

ఓట్లు, సీట్ల పరంగా కటమిలో సీనియర్ పార్టీగా ఉన్న జనసేనను జూనియరైన బీజేపీ అడుగడుగునా అవమానిస్తోందంటూ సేనాని పవన్ కల్యాణ్ బాహాటంగా విమర్శించారు. జీహెచ్ఎంసీలో త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతి అవకాశం దక్కుతుందని బలంగా నమ్మిన పవన్ కల్యాణ్.. చివరికి సీన్ మరోలా మారడంతో తన అసంతృప్తిని బహిరంగానే వెళ్లగక్కారు. పవన్ నేరుగా తెలంగాణలోని పరిస్థితిని వివరిస్తే, జనసేన ప్రధాన కార్యదర్శి మహేశ్ మాత్రం ఏపీలోనూ బీజేపీ వల్ల తాము భారీగా నష్టపోయామని అనడం రెండు పార్టీల మధ్య అగాధాన్ని పెద్దది చేసింది. దళితులు, మైనార్టీ, గిరిజనులు బీజేపీ పేరు చెబితేనే ఛీకొడుతున్నారన్న జనసేన.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తిరుపతిపై పునరాలోచనలో పడిందని, బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఒంటరిపోరుకు సైతం జనసేన దిగే అవకాశాలు లేకపోవని రిపోర్టులు వస్తున్నాయి. ఈ క్రమంలో

పవన్ కోపాన్ని చల్లార్చేలా..

పవన్ కోపాన్ని చల్లార్చేలా..


బీజేపీ చేతిలో అవమానాలు, ఆ పార్టీతో పొత్తు వల్ల నష్టాలపై పవన్, మహేశ్ లు బహిరంగ విమర్శలు చేసినా ఏపీ బీజేపీ నేతలు నోరు మెదపలేదు. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం ఓ రేంజ్ లోనే ఖండించారు. తిరుపతి బైపోల్ ముంచుకొస్తుండటంతో పెరిగిన గ్యాప్ ను పూడ్చుకోడానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ రంగంలోకి దిగారు. మంగళవారం అమరావతిలో పర్యటించిన లక్ష్మణ్.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో బీజేపీకి విభేదాలు లేవని, తిరుపతి ఉప ఎన్నికలో జనసేనతో కలిసే విజయం సాధిస్తామని అన్నారు. పవన్ నుంచి మరోసారి కన్సంట్ తీసుకున్న తర్వాతే రత్నప్రభ లేదా శ్రీనివాసులులో ఒకరి పేరును బీజేపీ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక..

తిరుపతిపై సోనియా తాత్సారం

తిరుపతిపై సోనియా తాత్సారం


ఏపీలోని తిరుపతి లోక్ సభ తోపాటే తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికీ ఈసీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించగా, మంగళవారం రాత్రే కాంగ్రెస్ పార్టీ సాగర్ అభ్యర్థిగా జానారెడ్డి పేరును ప్రకటించింది. కానీ తిరుపతి విషయంలో మాత్రం అధినేత్రి సోనియా తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుతానికి అందుతోన్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎంపీ చింతా మోహన్‌ మరోసారి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. తిరుపతి సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గతేడాది కరోనాతో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 23న నోటిఫికేషన్ జారీ కానుండగా, నామినేషన్ల దాఖలుకు ఈనెల 30న చివరితేది. తిరుపతిలో ఏప్రిల్ 17న పోలింగ్ జరుగనుంది. మే 2న ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటే ఫలితాలు వెలువడుతాయి.

English summary
as Election Commission (EC) announces schedule for Tirupati Lok Sabha by-election, preparations among the major parties have begun accordingly. one of the two retired ias offices ratna Prabha or srinivasulu could be the BJP candidate. congress party likely to put chinta mohan. ysrcp deployed physiotherapist doctor gurumurthy and tdp fields panabaka lakshmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X