• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?

|

ప్రతిష్టాత్మక తిరుపతి పార్లమెట్ నియోజకవర్గం ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ-జనసేన పార్టీల్లో అనూహ్య, అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు పార్టీల పొత్తు అవగాహన మేరకు తిరుపతిలో బీజేపీనే బరిలోకి దిగుతుండగా, అభ్యర్థిగా రత్నప్రభ ఖరారయ్యారు. మాజీ ఐఏఎస్, కర్నాటక ప్రభుత్వ ప్రధాన కర్యదర్శిగానూ పనిచేసిన రత్నప్రభ పేరును బీజేపీ హైకమాండ్ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. తనకు టికెట్ దక్కడపై రత్నప్రభ అనూహ్యంగా స్పందించారు. కాగా, ఆమె అభ్యర్థిత్వంపై జససేనగానీ పవన్ కల్యాణ్ గానీ ఒక్కమాటైనా మాట్లాడకపోవడం షాకింగ్ ట్విస్టుగా మారింది.

viral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడిviral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడి

కత్తి రత్నప్రభకే టికెట్

కత్తి రత్నప్రభకే టికెట్

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష స్థానం కోసం పోరాడుతోన్న బీజేపీ.. అటు వైసీపీ, ఇటు టీడీపీలను ఒకే స్థాయిలో విమర్శిస్తూ వస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తును కొనసాగిస్తూ బలపడేందుకు ప్రయత్నిస్తున్నది. ఏపీలో తమ ఎదుగుదలకు తిరుపతి ఉప ఎన్నికను గీటురాయిగా భావిస్తున్నామన్న బీజేపీ నేతలు అక్కడ అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలనేదానిపై తీవ్ర కసరత్తులు చేసింది. టికెట్ కోసం జనసేన నుంచి ఒత్తిడిరాగా, పవన్ ను ఎలాగోలా ఒప్పించి, పలువురు రిటైర్డ్ అదికారులు, మాజీ మంత్రుల పేర్లను పరిశీలించింది. దాసరి శ్రీనివాసులు, కృష్ణప్రసాద్‌, మునిసుబ్రమణ్యం, రావెల కిషోర్ బాబు తదితరులను పక్కనపెడుతూ చివరికి కత్తి రత్నప్రభకు టికెట్ ఖరారు చేసింది.

తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!

పుట్టింది ప్రకాశం.. పోటీ తిరుపతిలో

పుట్టింది ప్రకాశం.. పోటీ తిరుపతిలో

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఐఏఎస్ అధికారిణి కత్తి రత్నప్రభ సొంత జిల్లా ప్రకాశం. ఆమె తండ్రి కత్తి చంద్రయ్య, సోదరుడు ప్రదీప్‌ చంద్ర, భర్త విద్యా సాగర్‌ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు. కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి అయిన రత్నప్రభ కర్ణాటక సీఎస్ గా రిటైరైన తర్వాత వృత్తి నైపుణ్య అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆమె కొంతకాలం పాటు డిప్యుటేషన్‌పై ఏపీలోనూ పనిచేశారు. ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రత్నప్రభ అయితేనే వైసీపీని, సీఎం జగన్ ను ధీటుగా ఎదురుకుంటారనే ఉద్దేశంతో కమలనాథులు ఆమెకు అవకాశం కల్పించారు. అందుకు తగ్గట్లే రత్నప్రభ తన ప్రచారాన్ని మొదలుపెట్టేశారిలా..

బిగ్ సర్‌ప్రైజ్.. ఇది కల కాదుగా..

బిగ్ సర్‌ప్రైజ్.. ఇది కల కాదుగా..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై రత్నప్రభ అనూహ్యంగా స్పందించారు. పార్టీ హైకమాండ్ ప్రకటన చేసినప్పటి నుంచి రత్నప్రభ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ‘‘ఆర్ఎస్ఎస్, బీజేపీ అధినాయకత్వం నిజంగా నాకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇది కల కాదు కదా.. కాదు, నిజమే అని అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. దైవశక్తి కొలువైన, అత్యంత పవిత్రమైన తిరుపతిలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం నిజంగా దైవ సకల్పం, విధిరాత గానే భావిస్తున్నాను. అకస్మాత్తుగా నా ముందు పెద్ద సవాలు నిలిచింది. నియోజకవర్గంలోని చిట్టచివరి ఓటరు హృదయాన్నీ చేరుకునే ప్రయత్నంలో ఆ భగవంతుడు నాకు బలాన్ని ఇస్తాడని నమ్ముతున్నా'' అని రత్నప్రభ వ్యాఖ్యానించారు. అంతేకాదు..

రాత్రి నుంచి ఒకటే కాల్స్, మెసేజెస్..

రాత్రి నుంచి ఒకటే కాల్స్, మెసేజెస్..


బీజేపీ అభ్యర్థిత్వం ఖరారైన క్షణం నుంచి తనకు లెక్కకు మిక్కిలిగా ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని రత్నప్రభ తెలిపారు. గ్యాప్ లేకుండా వస్తోన్న సందేశాలను చూశాక, తనపై ప్రజలకు చాలా అంచనాలున్నాయని అర్థమైందని, ఆ మేరకు ఏఒక్కరినీ నిరాశపర్చకుండా రాత్రింబవళ్లూ తిరుపతి లోక్ సభ నియోజకవర్గం కోసమే పనిచేస్తానని రత్నప్రభ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకుగానూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ నేత సంతోష్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ తోపాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లకు కూడా రత్నప్రభ ధన్యవాదాలు తెలిపారు. కానీ

బీజేపీ అభ్యర్థిపై జనసేన మౌనం

బీజేపీ అభ్యర్థిపై జనసేన మౌనం

తిరుపతి ఉపఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పేరు ఖరారైన వెంటనే ఏపీ బీజేపీ నేతలు వరుసగా ట్వీట్లు ప్రకటనలతో సందడి చేశారు. అయితే, వారి మిత్రుడైన పవన్ కల్యాణ్ గానీ ఆయన పార్టీ జనసేన గానీ రత్నప్రభ అభ్యర్థిత్వంపై కనీస స్పందన వెలువరించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుపతి టికెట్ ఆశించి భంగపడ్డ పవన్ కల్యాణ్ ఇటీవల బీజేపీ స్థానిక నేతలపై కోపంగా ఉండటం, బీజేపీ వల్ల నష్టపోయామని జనసేన అధికారికంగా విమర్శలు చేయడం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. పవన్ ను ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పినా జనసేనాని స్పందించకపోవడం షాకింగ్ వ్యవహారంగా మారింది. జనసేనతో సంబంధం లేకుండా ముందుగానే ప్రచార కమిటీలు ప్రకటించిన బీజేపీ.. అభ్యర్థి ఎవరో ఖరారైన తర్వాత ఉమ్మడి కమిటీలనూ వేస్తామని గతంలో చెప్పింది. మరి రత్నప్రభ అభ్యర్థిత్వంపై సేనాని స్పందింకపోవడంతో కమిటీ ఉంటుందా, లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈనెల 30 వరకు తిరుపతిలో నామినేషన్లకు అవకాశం ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఫలితాలు వస్తాయి.

English summary
bharatiya janata party (BJP) has officially declared ratna prabha name as tirupati loksabha by election candidate. the former ias thanked bjp hicommand and said it was sudden surprise. meanwhile, being ally with bjp the jana sena party or pawan kalyan did not responded over ratnaprabha candidature yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X