• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌ కాళ్లకు కట్టుకట్టిన డాక్టర్‌కు తిరుపతి ఎంపీ టికెట్ : దుర్గా ప్రసాద్ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ

|

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. తాజాగా- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది. దీనికోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా: చివరి నిమిషంలో: ఇక కేబినెట్ భేటీ తరువాతే?

కొత్త ముఖానికి ఛాన్స్?

కొత్త ముఖానికి ఛాన్స్?

తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ కొత్త నేతను తెర మీదికి తీసుకుని రావచ్చని తెలుస్తోంది. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గురుమూర్తి.. వైఎస్ జగన్‌కు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా పని చేశారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో గురుమూర్తి ఆయన వెంటనే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వేల కిలోమీటర్ల కొద్దీ సాగిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ అనారోగ్యం బారిన పడకుండా సేవలు అందించారని అంటున్నారు. ఆయనకు తిరుపతి ఉప ఎన్నిక టికెట్ లభించే అవకాశం ఉందని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ..

బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ..

తిరుపతి సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు, దివంగత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే వాదన వినిపిస్తోంది. బల్లి దుర్గా ప్రసాద్ భార్య లేదా కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిని శాసన మండలికి ఎంపిక చేస్తారని సమాచారం. దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకోవడంలో భాగంగా శాసన మండలికి ఎంపిక చేయడంతో పాటు మున్ముందు..దళిత కోటా కింద మంత్రివర్గంలోకి తీసుకోవడానికీ అవకాశాలు లేకపోలేదని ప్రచారం చిత్తూరు జిల్లా వైసీపీ నేతల్లో జోరుగా సాగుతోంది.

తొలి ప్రాధాన్యత దుర్గా ప్రసాద్ కుటుంబానికే..

తొలి ప్రాధాన్యత దుర్గా ప్రసాద్ కుటుంబానికే..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో తొలుత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని, పోటీ చేయడానికి వారు ఇష్టపడితే టికెట్ ఇస్తారని అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదనే కారణంతోనే ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయంగా గురుమూర్తి పేరును వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన మెజారిటీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. గురుమూర్తి అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని వారు వైఎస్ జగన్‌కే వదిలేశారని అంటున్నారు.

  Sonu Sood Help to AP Farmer With Tractor
   త్రిముఖ పోరు తప్పనట్టే?

  త్రిముఖ పోరు తప్పనట్టే?

  తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ఇదివరకే ప్రకటించింది. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని బరిలో దింపింది, భారతీయ జనతా పార్టీ రేసులో నిల్చోబోతోంది. గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. ఇదివరకు తిరుపతి స్థానంలో ఓ సారి కాషాయ జెండా ఎగిరింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ వెంకటస్వామి ఇక్కడ విజయం సాధించారు. ఆ తరువాత మళ్లీ బీజేపీ నేతలు గెలుపురుచి చూడలేదు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ చింతా మోహన్ పోటీ చేయడం లాంఛనప్రాయమే. ఆయన ఏ మేరకు పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

  English summary
  Ruling YSR Congress Party MP ticket for Tirupati Lok Sabha Bypoll likely to get Physiotherapist Dr Gurumurthy, source said. Deceased Lok Sabha member Balli Durga Prasad family likely to to be sent to Legislative Council afther.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X