తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతికి అరుదైన ఘనత .. దేశ వ్యాప్త స్వచ్చతా త్రీస్టార్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్

|
Google Oneindia TeluguNews

దేశంలో స్వచ్చతా నగరంగా తిరుపతి అరుదైన ఘనత సాధించింది . గార్బేజ్‌ ఫ్రీ సిటీ స్టార్‌ రేటింగ్‌లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం ఈసారి 2020 పోటీల్లో టాప్‌ 1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. మొత్తం 1,435 నగరాలు పోటీ పడగా త్రీ స్టార్ రేటింగ్ లో తిరుపతి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఆన్ లైన్ లోనూ మొక్కులు చెల్లిస్తున్న శ్రీవారి భక్తులు ... లాక్ డౌన్ ఆదాయం ఎంతో తెలుసా!!ఆన్ లైన్ లోనూ మొక్కులు చెల్లిస్తున్న శ్రీవారి భక్తులు ... లాక్ డౌన్ ఆదాయం ఎంతో తెలుసా!!

స్వచ్చతా నగరాల స్టార్ ర్యాంకింగ్స్ లో తిరుపతి ఘనత

స్వచ్చతా నగరాల స్టార్ ర్యాంకింగ్స్ లో తిరుపతి ఘనత

స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ప్రతి ఏడాది పోటీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈసారి కూడా స్వచ్చతా నగరాల స్టార్‌ రేటింగ్స్‌ పోటీ నిర్వహించింది. నగరాల్లో అమలవుతున్న పరిశుభ్రత , స్వచ్చతా ప్రమాణాలు, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణ, ఇక స్వచ్చతా ప్రమాణాలను పాటిస్తున్న తీరుపై ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్‌ కేటాయించారు. గత ఏడాది తిరుపతి 51 వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 1 వ స్థానానికి చేరింది. ఇక విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది.

త్రీస్టార్‌ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి

త్రీస్టార్‌ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి

త్రీస్టార్‌ రేటింగ్‌లో టాప్‌-10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్‌ 5 ర్యాంకింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్‌ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్‌ స్టార్‌ ర్యాంకింగ్‌లో పోటీపడనుంది. ఇక ఈసారి జరిగిన పోటీలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌లో ఆరు నగరాలు సొంతం చేసుకున్నాయి. 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్‌ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది.

గ్యార్బేజ్ ఫ్రీ సిటీగా ఉంచటానికి తిరుపతిలో పీపీపీ పద్ధతి

గ్యార్బేజ్ ఫ్రీ సిటీగా ఉంచటానికి తిరుపతిలో పీపీపీ పద్ధతి

తిరుపతిని క్లీన్ సిటీ గా గ్యార్బేజ్ ఫ్రీ సిటీగా ఉంచటానికి పీపీపీ పద్ధతిన కార్పొరేషన్‌ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. స్వచ్ఛత, పరిశుభ్రతకు, చెత్తను వంద శాతం రీ సైక్లింగ్ చేయటం వంటి అంశాలపి దృష్టి పెడుతున్న ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణ చేస్తున్నారు. గ్యార్బేజ్ ఫ్రీ సిటీగా మార్చారు. ఇక స్వచ్చతా నగరంగా ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈసారి త్రీ స్టార్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుని దేశ వ్యాప్త కీర్తి సాధించింది.

సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భూమన

సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భూమన


తిరుపతి దేశంలో గార్బేజ్‌ ఫ్రీ సిటీగా దేశంలో గుర్తింపు పొందటంతో తిరుపతి అధికారులు, ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మాట్లాడుతూ ఇది మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది సమిష్టి కృషి అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా త్రిబుల్ స్టార్స్ లో తిరుపతికి మొదటి ర్యాంకు రావడం మంచి పరిణామన్నారు. ఇందు కోసం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, పారిశుధ్య కార్మికులు చేసిన కృషి చాలా గొప్పదని ఆయన వారిని ప్రశంసించారు . ఆధ్యాత్మిక నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చి దిద్దారని భూమన అన్నారు. భవిష్యత్ లో ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ లో పోటీ పడేలా నగరాన్ని మార్చాలని ఆయన అధికారులను కోరారు.

English summary
Tirupati is one of the country's most clean cities. The city of Tirupati is ranked number one nationally in Garbage Free City in three Star rating. Tirupati City, which is ranked 51st in ratings in 2019, is now in the top 1 of the 2020 competitions. A total of 1,435 cities competed . Tirupati got First Place in three-star rating
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X