తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో అనివార్యంగా మారిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి టీడీపీ ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఖాళీగా ఉన్న తిరుపతి ఎంపీ సీటును ఎన్నికల సంఘం నోటిఫై చేసినప్పటికీ, ఇంకా బైపోల్ ప్రకటనరాలేదు. ఈలోపు మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో మునిగిపోగా.. టీడీపీ మాత్రం పేరును ఖరారు చేసి ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. ఎలాగంటే..

Recommended Video

Tirupati LokSabha Bypoll | Oneindia Telugu

కన్నతల్లిపైనే అఘాయిత్యం -మద్యం తాగించి రేప్, హత్య -ఆమెకు కొడుకుతోనూ ఉందన్న పోలీసులుకన్నతల్లిపైనే అఘాయిత్యం -మద్యం తాగించి రేప్, హత్య -ఆమెకు కొడుకుతోనూ ఉందన్న పోలీసులు

త్వరలోనే ఈసీ షెడ్యూల్..

త్వరలోనే ఈసీ షెడ్యూల్..

ఇటీవల బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటే ఖాళీగా ఉన్న ఒక లోక్ సభ(వాల్మికి నగర్-బీహార్) సీటుకు, 11 రాష్ట్రాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటితో పాటే మరో 4 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నా, వివిధ కారణాలతో అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. గడువు ముంచుకొస్తుండటంతో కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలోని ఏడు అసెంబ్లీ సీట్లకు ఈసీ త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనుంది. వీటితోపాటే ఖాళీ స్థానాలుగా నోటిఫై అయిన మూడు పార్లమెంట్ సీట్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రణాళికలు వేస్తోంది. కర్ణాటకలో కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మరణంతో ఖాళీ అయిన బెల్గాం, కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో కన్యాకుమారి స్థానం, వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ ముగ్గురూ కరోనా కాటుకు బలైనవారే కావడం విచారకరం. ఇకపోతే..

నితీశ్ కుమార్ అనే నేను.. ఏడోసారి బీహార్ సీఎంగా ప్రమాణం -ఆమెకు జాక్‌పాట్ -ఇదీ ఎన్డీఏ కేబినెట్నితీశ్ కుమార్ అనే నేను.. ఏడోసారి బీహార్ సీఎంగా ప్రమాణం -ఆమెకు జాక్‌పాట్ -ఇదీ ఎన్డీఏ కేబినెట్

చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్..

చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్..

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లతోపాటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగే వీలుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అందరికంటే ముందుగా అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో జగన్ సర్కారు విధానాలను తీవ్రంగా ఎండగడుతోన్న ఆయన.. తిరుపతి బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సోమవారం తిరుపతి పార్లమెంట్ స్థానానికి చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ఎన్నికలో టీడీపీ గెలుపునకు కృషిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో తిరుపతి బైపోల్ అభ్యర్థిని కూడా చంద్రబాబు ప్రకటించేశారు..

పనబాకపై బీజేపీ చూపు..

పనబాకపై బీజేపీ చూపు..

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. తిరుపతి సీటును ఈసీ నోటిఫై చేసినప్పటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాల్లో పనబాకకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన తిరుపతిలో పాపులర్ నేతల్ని వెతుక్కోవడం బీజేపీకి కష్టంగా మారిందని, దాంతో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నాయకురాలు పనబాక లక్షి వైపు కమలనాథులు మొగ్గుచూపుతున్నారని, ఆమె చేత టీడీపీకి రాజీనామా చేయించి, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించేలా నేతలు మంత్రాంగం నడుపుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందులో నిజానిజాలు ఎంతో ఎన్నికల నాటికి తేలతాయని భావించేలోపే.. చంద్రబాబు.. పనబాక పేరును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టగలిగారు. పనబాక గతంలోనూ టీడీపీ అభ్యర్థిగానే బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు..

బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు..

దక్షిణాదిలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పట్టు కోసం బీజేపీ దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా.. ఇతర పార్టీలతో పొత్తు లేనిదే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. 1999లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తొలిసారి తిరుపతి ఎంపీ సీటును (అభ్యర్థి నందిపాకు వెంకటస్వామి) గెలుచుకుంది. 2004లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వెంకటస్వామి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. 2009లో తిరుపతి సీటులో టీడీపీనే బరిలోకి దగగా వర్ల రామయ్య రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక 2014లో టికెట్ మళ్లీ బీజేపీకే దక్కగా ఆ దఫా కూడా కమలం గుర్తు అభ్యర్థి(కారుమంచి జయరాం) రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల నాటికి ఎన్డీఏ నుంచి టీడీపీ విడిపోవడంతో బీజేపీ ఒటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ దాదాపు రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 5 లక్షల ఓట్లు సాధించారు.ఇక.

నోటాకు 25, 781 ఓట్లు రాగా.. నోటా కంటే తక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 24, 039 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరి రావుకు 16,125 ఓట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ ప్రసాదరావు మరణంతో 2021లో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు అభ్యర్థుల కోసం వైసీపీ, బీజేపీ తంటాలు పడుతుండగా, తానుకూడా పోటీకి సిద్ధమంటూ జనసేన సంచలనం రేపింది. తమ తురుపుముక్కపై ఇతర పార్టీల కన్నుందని గ్రహించిచారు కాబట్టే చంద్రబాబు టీడీపీ అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించినట్లు తెలుస్తోంది.

English summary
TDP intensifies drills on Tirupati Lok Sabha by-election Chandrababu finalized the name of former Union Minister Panabaka Lakshmi as the ADP candidate. On Monday, Chandrababu held a video conference with leaders from Tirupati on the strategies to be adopted in the elections. Chandrababu directed the leaders to work for the victory of the TDP in the by-elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X